‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు’.
‘ఇక్కడ కథ మీది, కల మీది’..
‘ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం’.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’
అంటూ మనసుకు హత్తుకునే మాటలతో ఆ’కట్టే’సుకుంటున్నారు హోస్ట్ తారక్. బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే ఓ రియాలిటీ షో రాబోతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన కొత్త ప్రోమో ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింప చేస్తుంది. స్ఫూర్తివంతంగా నిలుస్తుంది. ఎడ్యూకేట్ చేసేలా ఉంది. జస్ట్ ప్రోమోనే ఈ రేంజ్‌లో ఆకట్టుకుంటే ఇక షో ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.
ఒక స్కూలు టీచర్ పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? అని పిల్లలను అడిగితే. కలెక్టర్ అని ఒకరు, పైలెట్ అని మరొకరు సమాధానం చెప్తుండగా ఒక విద్యార్థిని మాత్రం అమ్మను అవుదాం అనుకుంటున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పెద్దయ్యాక అదే అమ్మాయికి ఎన్టీఆర్ ముందు హాట్ సీట్‌లో కూర్చునే అవకాశం వరించింది. అప్పుడు ఎన్టీఆర్ జీవితంలో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా ఆమె మరోసారి ‘అమ్మనవుదాం అనుకుంటున్నాను’ అని బదులిచ్చింది.
రేపటితరాన్ని ముందుకు నడపాలంటే అది అమ్మ వల్లే సాధ్యం అంటూ తన తల్లి పడ్డ కష్టాలను వివరించింది. ఫైనల్‌గా ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.ఇక్కడ కథ మీది, కల మీది ఆట నాది. రండీ ఎవరు మీలో కోటీశ్వరుడు` అని ఎన్టీఆర్ చెప్పడం గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. త్వరలో ఈ షో ప్రసారం కానుందని తెలిపింది. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ప్రసారం కావాల్సిన ఈ షో కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ప్రారంభం కాబోతుంది.
కరోనా సమయంలో ఏర్పడిన గడ్డు పరిస్థితులు చూపిస్తూ గుండె బరువెక్కేలా డిజైన్ చేసిన మొదటి ప్రోమో జనాలను ఆలోచింపజేసేదిగా ఉంది. ఇందులో తారక్ మీసకట్టు లుక్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆదివారం ఈ షో ప్రోమోని నిర్వాహకులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఐదో సీజన్‌కి ఎన్టీఆర్ హోస్ట్ చేస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షోకు దేశవ్యాప్తంగా గొప్ప ప్రజాదరణ రావడంతో దీన్ని తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో ప్రసారం చేసారు. మూడు సీజన్లకు కింగ్ అక్కినేని నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం.
2017లో ప్రసారమైన నాలుగో సీజన్‌ను మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. నాలుగు సీజన్లు మా టీవీలో ప్రసారం కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోయే ఐదో సీజన్ మాత్రం జెమిని టీవీలో ప్రసారం కాబోతోంది.