తారకరత్న చనిపోవడం తన కుటుంబానికి తీరనిలోటు. ఇది పక్కనబెడితే.. తారకరత్నకు తాత అంటే ఎంత ఇష్టమనేది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ విషయాన్ని నెటిజన్స్ మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.
తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపేసింది. నెలరోజుల ముందు తమలో ఒకడిగా ఉన్న తారకరత్న.. ఇప్పుడు తమ మధ్య లేడనే విషయాన్ని అతడి కుటుంబసభ్యులే కాదు ఫ్రెండ్స్, సెలబ్రిటీలు తీసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న భౌతిక కాయం దగ్గర అతడి పిల్లలున్న విజువల్స్.. చూస్తున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. నాన్న ఇక తిరిగిరాడు అనే నిజం వాళ్లకు ఎలా చెప్పేది? అని కుటుంబసభ్యులు తమలో తామే చాలా బాధపడుతున్నారు. ఇలాంటి టైంలో తారకరత్న పిల్లల గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
ఇక విషయానికొస్తే.. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా తారకరత్న దాదాపు 20 ఏళ్ల క్రితమే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ప్రారంభంలో ఒకటో రెండో హిట్స్ కొట్టిన మనోడు.. పెద్దగా సక్సెస్ అయితే చూడలేకపోయాడు. ‘అమరావతి’ మూవీలో విలన్ గా చేసి తనలో అసలు సిసలు నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ వచ్చిన తారకరత్న ఓవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మరోవైపు నటిస్తూ వచ్చాడు. కొన్ని నెలల ముందు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించాడు. ఇలాంటి ఆయన పాదయాత్రలో పాల్గొనడం, తొలిరోజే కుప్పకూలడం, 23 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది.
తారకరత్న చనిపోవడంతో అతడి భార్య అలేఖ్యారెడ్డితో పాటు ముగ్గురు పిల్లలు ఒంటరివాళ్లు అయ్యారు. అయితే తారకరత్నకు కుటుంబం అంటే ఎంతిష్టమో.. తాత ఎన్టీఆర్ అన్నాసరే అంతకు మించిన ఇష్టం ఉంది. అందుకే తన పిల్లలకు ఆయన పేరు కలిసొచ్చేలా పేరు పెట్టుకున్నారు. తనకు కూతురికి నిష్క (NISHKA) అని, ఆ తర్వాత పుట్టిన ట్విన్స్ లో అబ్బాయికి తనయ్ రామ్ (TANAY RAM), అమ్మాయికి రేయా (REYA) అని పేరు పెట్టుకున్నాడు. ఈ మూడింటిలోనూ మొదటి అక్షరాలు గమనిస్తే.. NTR అని వస్తుంది. ఇది తెలిసి ఫ్యాన్స్.. తారకరత్నకు తాత ఎన్టీఆర్ పై ఉన్న ఇష్టాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ విషయమై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
#Tarakaratna kids with #NandamuriBalakrishna 💚
Nishika (N)
Tanay Ram (T)
Reya (R) pic.twitter.com/AZPsfU8qTR— Suresh Kondi (@SureshKondi_) February 20, 2023