బాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. ఏకంగా స్పై యూనివర్స్ లోని రాబోయే మూవీలో నటిస్తున్నాడు. ఈ విషయమై ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇంతకీ ఏంటి విషయం?
ఎన్టీఆర్.. అద్భుతమైన యాక్టర్. కాకపోతే గతేడాది ముందు వరకు కేవలం తెలుగు వరకే పరిమితం. సౌత్ ఇండియా, జపాన్ లో కొంతమందికి మాత్రమే తారక్ తెలుసు. ఎప్పుడైతే ‘ఆర్ఆర్ఆర్’ వచ్చిందో.. దెబ్బకు నందమూరి హీరో పేరు మార్మోగిపోయింది. ఏకంగా హాలీవుడ్ లోనే ప్రతి ఒక్కరూ ఇతడి గురించి ఆరా తీయడం స్టార్ చేశారు. ప్రఖ్యాత న్యూస్ పేపర్ లోనూ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఆర్టికల్స్ పడ్డాయి. రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్ గెలుచుకోవడంతో మనోడి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. దీంతో తర్వాతి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో అనుకుంటున్నట్లు బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. NTR30తో బిజీగా ఉన్న తారక్, బాలీవుడ్ లోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేయడంతో అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. తారక్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో ‘వార్’, ‘పఠాన్’ మూవీస్ తో స్పై యూనివర్స్ క్రియేట్ చేశారు. ఇందులో నెక్స్ట్ వస్తున్న మూవీ ‘వార్ 2’. తాజాగా ఈ విషయమై నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ కూడా ప్రకటన చేసింది. ఇప్పటికే నాలుగు సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. వార్ 2, టైగర్ 3, టైగర్ vs పఠాన్ రాబోతున్నాయి.
ఇప్పుడు ‘వార్ 2’ సినిమాలో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు అనౌన్స్ మెంట్ వచ్చింది. ట్విట్టర్ మొత్తం ఈ న్యూస్ తో మార్మోగిపోతుంది. వార్ తొలి పార్ట్ లో హృతిక్ తో పాటు టైగర్ ష్రాఫ్ ఉన్నాడు. ఇప్పుడు తారక్ కూడా యాక్ట్ చేస్తాడని అంటున్నారు కాబట్టి ఎలాంటి పాత్ర ఇస్తారు? అది ఎలా ఉండబోతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సినిమా రావడానికి మరో మూడు నాలుగేళ్లు పట్టేలా కనిపిస్తుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. బాలీవుడ్ స్పై యూనివర్స్ లోకి ఎన్టీఆర్ ఎంటర్ కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
IT’S OFFICIAL… HRITHIK – JR NTR IN ‘WAR 2’… #YRF pulls off a casting coup… #HrithikRoshan and #JrNTR will share screen space for the first time in #War2… #AyanMukerji directs. #YRFSpyUniverse pic.twitter.com/rGu8Z3Nzs7
— taran adarsh (@taran_adarsh) April 5, 2023