సాధారణంగా సెలబ్రిటీలపై సామాన్యులకు విపరీతమైన క్రేజ్, క్రష్, లవ్ ఉంటుంది. సాధ్యం కాదని తెలిసినా సరే.. సినిమా హీరో, హీరోయిన్లను పిచ్చిగా ప్రేమించేవారు కోకొల్లలు. సెలబ్రిటీలంటే ఆకర్షణ ఉండటం సహజం. అలానే ఎవరైనా హీరో, హీరోయిన్ సామాన్యులపై మనసు పారేసుకుని.. వారిని ప్రేమిస్తే.. అసలు ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా. తన జీవితంలో అలాంటి సంఘటన చోటు చేసుకుంది అంటుంది ఓ కుర్ర హీరోయిన్. ఓ వ్యక్తికి ఏడాది పాటు సైట్ కొట్టానని.. కానీ అతడు మాత్రం.. కనీసం తనవైపు కన్నెత్తి కూడా చూడలేదని.. అతడి ప్రవర్తన తనకు ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చింది సదరు హీరోయిన్. ఆ వివరాలు..
కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ తన జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికర అంశాల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. వరుస హిట్ చిత్రాల్లో నటిస్తోన్న ఈ భామ.. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్-2లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఫిట్‌నెస్ కోసం గత కొన్నేళ్లుగా నేను జిమ్‌కు వెళ్తున్నాను. అక్కడ ఓ యువకుడిని చూసి అతడిపై మనసు పారేసుకున్నాను. ఓ ఏడాది పాటు అతడికి సైట్ కొట్టాను. కానీ అతడు మాత్రం నావైపు కనీసం కన్నెత్తి చూడలేదు. వచ్చాడా.. తన పని తాను చూసుకున్నాడా.. వెళ్లి పోయాడా అన్నట్లు ఉండేవాడు. అతడి ప్రవర్తన నాకు బాగా నచ్చింది. అందుకే అతడికి సైట్ కొట్టాను. అయితే ఆ విషయం అతడికి తెలియదు. ఆ తర్వాత నేను వేరే జిమ్‌కు వెళ్లడంతో.. అతడిని చూసే అవకాశం లభించలేదు’’ అని చెప్పుకొచ్చింది.
ఇలా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ.. తమ పని ఏదో అది మాత్రం చూసుకుని వెళ్లే వారంటే తనకెంతో ఇష్టం అని చెప్పింది ప్రియా భవాని. అంతేకాక తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులతో జల్సాలు చేస్తూ.. లగ్జరీ కార్లలో షికార్లు తిరిగే యువకుల కంటే.. స్వశక్తితో ఎదుగుతూ.. బైక్ మీద తిరిగే యువకులంటే తనకు ఎంతో అభిమానం అని చెప్పుకొచ్చింది. అయితే తాను సైట్ కొట్టిన వ్యక్తి పేరు మాత్రం వెల్లడించలేదు ప్రియా భవాని. ఏది ఏమైనా ఓ హీరోయిన్‌కు ఇంతగా నచ్చాడంటే.. అతగాడేవరో కానీ లక్కీ ఫెలో.. కానీ ఏం లాభం.. ఆ విషయం అతడికి తెలియదు కదా అంటున్నారు ఈ వార్త తెలిసిన తర్వాత.