టాక్ షోల్లో.. దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచి రికార్డులు క్రియేట్ చేస్తోంది అన్‌స్టాపబుల్. ఈ షో ద్వారా బాలకృష్ణలోని మరో యాంగిల్ ప్రేక్షకులకు తెలిసింది. తనకంటూ ప్రత్యేకమైన మ్యానరిజం, పంచ్ డైలాగ్‌లతో.. షోకి వచ్చిన సెలబ్రిటీలను ఆటపట్టిస్తూ.. ఆసక్తికర ప్రశ్నలు సంధిస్తూ.. చాలా ఇంట్రెస్టింగ్‌గా షోను నడిపిస్తున్నారు బాలయ్య. హోస్ట్ అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పాడు బాలయ్య. ఈ షోకు ప్రధాన ఆకర్షణ బాలయ్యే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్‌స్టాపబుల్ షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సీజన్ వన్ క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. టాక్ షోలకే బాప్ షోగా నిలిచింది అనస్టాపబుల్. ఆ ఉత్సాహంతో సీజన్ 2ని గ్రాండ్‌గా ప్రారంభించారు.
ఇక సీజన్ 2 తొలి ఎపిసోడ్‌నే చంద్రబాబుతో ప్లాన్ చేశారు షో నిర్వాహాకులు. అక్టోబర్ 14న ఆహాలో అన్‌స్టాపబుల్ సీజన్ 2 తొలి ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. బావ-బామ్మర్దులు, అల్లుడితో కలిసి చేసిన ఈ షో.. 24 గంటల వ్యవధిలో మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక సీజన్ 2కి మెగాస్టార్ చిరంజీవి కూడా రాబోతున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతుండగా.. తాజాగా రిలీజైన ప్రోమోలో బాలయ్య చెప్పిన డైలాగ్‌తో పవన్ కళ్యాణ్ కూడా అన్‌స్టాపబుల్‌కి వచ్చే అవకాశం ఉందా అనే అనుమానాలు క్రియేట్ అయ్యాయి. ఆ వివరాలు..
ఈ క్రమంలో తాజాగా ఆదివారం అన్‌స్టాపబుల్ సీజన్ 2.. సెకండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఎపిసోడ్ 2కి గెస్ట్‌గా వచ్చింది యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నల గడ్డ. ఈ ఇద్దరు హీరోలు కొంత కాలం క్రితం వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో సెకండ్ ఎపిసోడ్‌కు వారిని గెస్ట్‌లుగా పిలవడంతో.. సీజన్ 2 ఏ రేంజ్‌లో ఉండనుందో.. ఏ సెలబ్రిటీలు గెస్ట్‌లుగా రాబోతున్నారో హింట్ ఇచ్చారు నిర్వహాకులు.
ఇక ప్రోమోలో బాలయ్య తనదైన మాస్ డైలాగ్స్‌తో విశ్వక్ సేన్, సిద్ధూలతో ఆడుకున్నాడు. మీరిద్దరు మాస్ కా దాస్, బాస్ అయితే నేడు మాస్ కా గాడ్ అంటూ చెప్పిన డైలాగ్‌కి ప్రేక్షకులు చప్పట్లతో మారుమోగించారు. అలానే సిద్ధూ హెయిర్ స్టైల్‌పై కామెంట్ చేస్తూ.. గతంలో తాను మెస్సి లుక్‌తో కనిపించిన సినిమాలన్ని ఫ్లాప్ అయ్యియి అన్నారు బాలయ్య. ఇలా వీరద్దరితో సరదాగా సాగుతున్న షోలోకి సడెన్‌గా నిర్మాత నాగ వంశీ శరత్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో బాలయ్య.. భీమ్లానాయక్‌కు ముందుగా అనుకున్న హీరో ఎవరని ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత బాలయ్య మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు కాల్ చేశాడు.
బాలయ్య.. త్రివిక్రమ్‌తో మాట్లాడుతూ.. నా షోకి ఎప్పుడు వస్తావ్ అని ప్రశ్నించాడు. అందుకు త్రివిక్రమ్.. మీరు రమ్మంటే ఇప్పుడే వస్తాను సార్.. రెడీగా ఉన్నాను అంటాడు. అందుకు బాలయ్య నువ్వు వస్తే ఎవరితో రావాలో తెలుసు కదా అంటూ ఇండైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి కామెంట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా పీకే అంటూ అభిమానులు కేరింతలు కొట్టడం.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అందుకు తగ్గట్టుగా ప్లే కావడం గమనార్హం.
ఇక బాలయ్య డైలాగ్‌తో పవన్ కళ్యాణ్.. అన్‌స్టాపబుల్ షోకి రాబోతున్నారా అనే సందేహాలు మొదలయ్యియి ప్రేక్షకులుకు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక అన్‌స్టాపబుల్ షోకి వస్తే.. ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చెప్పడం ఎవరి తరం కాదు. ఇక మెగా, నందమూరి ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. మరి సీజన్ 2 ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రసుత్తం ఈ వీడియో వైరలవుతోంది.
Confirm ah aythe #Unstoppable2WithNBK pic.twitter.com/mR5fOJCgII
— 𝙎𝙖𝙍𝙖𝙩𝙝 (@SaRath_Tweetss) October 16, 2022