నేనే నిత్యం నేనే సత్యం అన్నాడు. నేనే దేవుడ్ని అని చెప్పాడు. ఎందరో అమాయకులు ఆయనకు భక్తులయ్యారు. ఇక ఓ ప్రముఖ సినీ నటితో స్వామి రాసలీల వ్యవహారం బయటకు రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత నిత్యానంద ఈ వివాదంపై ఎన్ని సంచలన వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం ఆరోపణలు, కోర్టు కేసులు నమోదు కావడంతో.. నిత్యానందుడు దేశం నుంచి మాయమయ్యాడు. ఈక్వెడార్ దగ్గరలోని ఒక దీవిని సొంతం చేసుకుని దానికి కైలాస దేశమని పేరు కూడా పెట్టి అక్కడే ఉంటున్నాడు. ప్రత్యేక కరెన్సీని కూడా ముద్రించుకున్నాడు. తన దేశానికి వచ్చే భక్తులకు నేరుగా పరమశివుడి దర్శనమే చేయిస్తానన్నాడు.
ఆ తర్వాత కొన్నళ్ల పాటు ఆయన గురించి ఎక్కడా ఎలాంటి వార్తలు లేవు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం నిత్యానంద వింత జబ్బుతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక వీటిని అటుంచితే తాజాగా నిత్యానంద పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ హీరోయిన్ ఒకరు నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ వెల్లడించడంతో.. ప్రస్తుతం ఆయన పేరు మారోసారి మీడియాలో మారుమోగుతంది. ఆ వివరాలు..
నటి ప్రియా ఆనంద్.. నిత్యానందను పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది. అమెరికాలో పెరిగిన ఈ బ్యూటీ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. కోలీవుడ్‌లో వామనన్ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తరువాత శివకార్తికేయన్, అధర్వ, విక్రమ్ ప్రభు, గౌతమ్ కార్తీక్, ఆర్‌జే బాలాజీకి జంటగా నటించింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ప్రియా ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం ఆరోపణలు, కోర్టు కేసులతో దేశం విడిచి పారిపోయిన నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రియా ఆనంద్ తెలిపింది. నిత్యానంద వింత రోగంతో బాధపడుతున్నాడు.. చనిపోయాడు అని ప్రచారం జరుగుతున్న వేళ ప్రియా ఆనంద్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘వేలాది మంది భక్తులు ఆరాధిస్తున్న వ్యక్తి నిత్యానందస్వామి. ఆయన్ని పెళ్లి చేసుకుంటే నేను పేరు మార్చుకోవలసిన అవసరం కూడా ఉండదంటూ’’ సరదాగా బదులిచ్చింది ప్రియా ఆనంద్. ఆమె వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.