సినిమాలకు, రాజకీయాలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తుంటారు. అలా చేసిన వారు ముఖ్యమంత్రులుగా చరిత్ర సృష్టించారు.
సినిమాలకు, రాజకీయాలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తుంటారు. అలా చేసిన వారు ముఖ్యమంత్రులుగా చరిత్ర సృష్టించారు. అలాగే MPలు, MLAలుగా కూడా రాణిస్తున్నారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి సీఎం అయ్యారు. MGR, జయలలిత వంటి వారు తమిళ రాజకీయాలను శాసించారు. రోజా మంత్రిగా, బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ వంటి సినీ ప్రముఖులు సొంత పార్టీలు పెట్టుకొని పోటీకి సిద్దమవుతున్నారు. రజినీ కాంత్ రాజకీయాల నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమకు చెందిన వారు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ ప్రధాన మంత్రిగా చేయలేదు. ఇప్పుడీ అరుదైన ఘనత సాధించబోతుంది ఒకప్పటి నటి రంజిత. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భారతదేశం ఆధ్యాత్మికమైనది. ఇక్కడ భక్తులు గుళ్లు, గోపురాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. స్వాములు, సన్యాసులను కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. వారితో తమ బాధలను చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందని భావిస్తుంటారు. ఈ నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టుకొని కొంత మంది బాబాలు, స్వామీజీలుగా ఎదిగారు. అందులో ఇండియా నుంచి వివాదాస్పద స్వామి నిత్యానంద మొదటి కోవలోకి వస్తారు. ఈయన దేశం విడిచి పరారైన సంగతి అందరికి తెలిసిందే. భారతదేశాన్ని విడిచిపెట్టి, మరో దేశాన్ని సృష్టించుకున్నాడు. ఆ దీవిని తాను ఏలుతునట్లు ప్రకటించుకున్నాడు. ఆ దీవికి ‘కైలాస దేశం’ అనే పేరును గతంలోనే ప్రకటించాడు.
తాజాగా ఆయన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను ఆ దేశానికి ప్రధానిని చేశారు. దానికి సంబంధించిన ప్రకటన గురించి ఓ తమిళ పత్రిక కథనాన్ని విడుదల చేసింది. దీంతో మరోసారి నిత్యానంద స్వామి వార్తల్లో నిలిచాడు. నిత్యానంద వెబ్‌సైట్‌లోను కైలాస ప్రధాని గురించి ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. వెబ్‌సైట్‌లో ఫోటో కింద నిత్యనంద స్వామి అని పేరు ఉంది. ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా కైలాస దేశం తరఫున మహిళ రాయబారులతో కలిసి హాజరయ్యారాయన. ఈ నేపథ్యంలోనే నటి రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరయ్యే అవకాశముందని సమాచారం. కాగా రంజిత ప్రధాని అవనుందనే వార్త వైరల్ అవడంతో నెటిజన్లు ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.