పవన్ కల్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయం, ఇటు సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. రెండ్రోజుల క్రితం పవన్ ప్రాక్టీస్ స్టిల్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి ప్రీ షూట్ విజువల్స్ అంటూ ఓ వీడియో విడుదల చేశారు. అందలో పవన్ పోరాట దృశ్యాలను ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్ ఉన్నాయి. ఆయుధాన్ని వేగంగా తిప్పడం, శత్రువులపై చెలరేగడం చూస్తుంటే ఈ సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి పవన్ కల్యాణ్- క్రిష్ జాగర్లమూడి క్రేజీ కాంబో హిట్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.