ప్రశాంత్ నీల్.. సౌత్- నార్త్ అని తేడా లేకుండా కేజీఎఫ్ అనే సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్ల దగ్గర క్యూ కట్టేలా చేశాడు. చేసిన మూడు సినిమాలతోనే ఎంతో ఫ్యాన్ బేస్, క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో అప్పు గురించి ప్రస్తావించాడు. ఒకప్పుడు అప్పుపై ప్రశాంత్ నీల్ ఎంత ధ్వేషం పెంచుకున్నాడో స్వయంగా తానే తెలియజేశాడు.
‘నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మాకు కర్ణాటకలో కొన్ని హోటల్స్ ఉండేవి. ఆ హోటల్ ప్రదేశాల్లో నేను మా ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుకునేవాడిని. అయితే ఓ రోజు నేను మా ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ మ్యాచ్ ప్లాన్ చేశాను. రాత్రంతా రేపు మ్యాచ్ ఎలా ఆడాలి? ఎంత స్కోర్ చేయాలి అంటూ దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాను. తర్వాత రోజు ఆడేందుకు వెళ్తే మా హోటల్ ప్లేస్ లో ఏదో సినిమా షూటింగ్ జరుగుతోంది. నాకు చాలా కోపం వచ్చింది. నేను ప్లాన్ చేసుకున్న క్రికెట్ మ్యాచ్ ఆడలేకపోయాను. మేనేజర్లు పర్మీషన్ ఇవ్వడంతో వాళ్లు షూటింగ్ చేసుకుంటున్నారు. ఎవరి సినిమా అని అడిగాను.. రాజ్‌కుమార్ సార్ అబ్బాయి పునీత్ రాజ్ కుమార్ డెబ్యూ సినిమా అని చెప్పారు.’
ఇది కూడా చదవండి: KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బ్యాగ్రౌండ్! ఎవరీ ప్రశాంత్ నీల్?
‘నా మ్యాచ్ పాడు చేశాడని.. పూనీత్ పై కోపం పెంచుకున్నాను. అప్పు సినిమా రిలీజ్ అయ్యింది, 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. కానీ, పునీత్ మీద కోపంతో నేను ఆ సినిమా చూడలేదు. ఆ తర్వాత మా ఫ్యామిలీ అంతా ఓచోట కలిస్తే.. నేను రాను అన్నా కూడా బలవంతంగా నన్ను అప్పు సినిమాకి తీసుకెళ్లారు. ఆ సినిమాలో పునీత్ సార్ పర్ఫార్మెన్స్ చూసి మెస్మరైజ్ అయిపోయాను. ఆ క్షణం నుంచి నేను పునీత్ రాజ్ కుమార్ గారి అభిమానిగా మారిపోయాను’ అంటూ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. అప్పుతో సినిమా తీయాలనుకున్నారు నిజమేనా? అని అడిగిన ప్రశ్నపై ప్రశాంత్ నీల్ స్పందించాడు.
‘ఉగ్రం సినిమా తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో సినిమా తీయాలనుకున్నాను. ఉగ్రం సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ మిస్ అయ్యింది. అవి కూడా కలుపుకుని ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ సినిమా కథ రాసుకున్నాను. పునీత్ గారికి కథ వినిపించాను. ఆయనకు కథ బాగా నచ్చింది. సినిమా పేరు ‘ఆహ్వాన’ అని టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాం. తర్వాత పునీత్ గారికి వేరే ప్రాజెక్ట్స్ ఉండటంతో.. ఈలోగా నన్ను వేరే సినిమా తీసుకోమని చెప్పారు. ఆ తర్వాత కేజీఎఫ్ ఐడియా రావడం, అది ఇంత టైమ్ తీసుకోవడం జరిగింది. ఈలోపు పునీత్ గారు మనందరిని వదిలి వెళ్లిపోయారు. ఆ విధంగా పునీత్ రాజ్ కుమార్ తో సినిమా తీసే అవకాశాన్ని మిస్ అయ్యాను’ అంటూ అప్పుపై తనకున్న కోపం, అభిమానం, ఆయనతో ఉన్న జ్ఞాపకాలను ప్రశాంత్ నీల్ నెమరు వేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.