మనిషి జీవితంలో ఎన్ని జ్ఞాపకాలు ఉన్నా కూడా.. బాల్యపు మధురస్మృతులనేవి ఎంతో ప్రత్యేకం. టీనేజ్, మ్యారేజ్ తర్వాత కానీ, వృద్ధాప్యంలో కానీ.. చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ‘ఏదేమైనా ఆ రోజులే వేరు, చిన్నప్పటి రోజులే బాగుండేవి’ అని అనుకుంటూ ఉంటారు.
మనిషి జీవితంలో ఎన్ని జ్ఞాపకాలు ఉన్నా కూడా.. బాల్యపు మధురస్మృతులనేవి ఎంతో ప్రత్యేకం. టీనేజ్, మ్యారేజ్ తర్వాత కానీ, వృద్ధాప్యంలో కానీ.. చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ‘ఏదేమైనా ఆ రోజులే వేరు, చిన్నప్పటి రోజులే బాగుండేవి’ అని అనుకుంటూ ఉంటారు. సెలబ్రిటీల చైల్డ్‌హుడ్ పిక్స్ వెతికి పట్టుకుని, ప్రేక్షకాభిమానులకు, నెటిజన్ల ముందుకు తీసుకొచ్చే సుమన్ టీవీ, ఇప్పటి వరకు ఎంతోమంది ప్రముఖుల చిన్ననాటి ఫోటోలను వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు తెలుసుకోబోయే సెలబ్రిటీ ఎవరో తెలుసా?.. సినిమాల్లో కాదు, నిజ జీవితంలోనూ హీరోగా మారి.. ఆపదలో ఉన్న వారి పాలిట దేవుడిగా కోలువై.. ఎంతో మంది హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకున్న వ్యక్తి.
ఆయనెవరో కాదు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. లెజెండరీ కన్నడ యాక్టర్ డా. రాజ్ కుమార్, పార్వతమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, లక్ష్మీ, పూర్ణిమ. మూడో కుమారుడైన పునీత్, చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణంలో పెరగడం వల్ల నాన్న, అన్నయ్యలానే తాను కూడా నటుడవ్వాలని డిసైడ్ అయ్యారు. సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అవడానికి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉపయోగపడొచ్చు కానీ తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుని.. యూత్ ఐకాన్‌గా, పవర్ స్టార్‌గా ఎదిగారు.
లవ్, ఫ్యామిలీ, యాక్షన్ సినిమాలతో బిగ్గెస్ట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న పునీత్.. యాక్టర్, సింగర్, ప్రొడ్యూసర్, హోస్ట్, ఫిలాంత్రఫిస్ట్.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, సేవా రంగంలోనూ తనదైన ముద్ర వేశారు పునీత్. పేద విద్యార్థులకు ఉచిత విద్య, గోశాలల నిర్మాణం, వాటి సంరక్షణ.. ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సామాజిక మాధ్యమాలలో పునీత్ రాజ్ కుమార్ చిన్ననాటి పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ తమ ప్రేమను చాటుకుంటున్నారు అభిమానులు.