పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినీ అభిమానులనే శోక సంద్రంలో ముంచేసి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అతడు లేనప్పటికీ అప్పు(పునీత్ ముద్దు పేరు)ను తమ గుండెల్లో దేవుడిగా గుడి కట్టుకున్నారు అభిమాన గణం.
పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినీ అభిమానులను శోక సంద్రంలో ముంచేసి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అతడు భౌతికంగా లేనప్పటికీ అప్పు(పునీత్ ముద్దు పేరు)ను తమ గుండెల్లో దేవుడిగా గుడి కట్టుకున్నారు అభిమాన గణం. కన్నడ కంఠీరవ, లెజండరీ నటుడు రాజ్ కుమార్ కొడుకుగా, మరో స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ తమ్ముడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. తన డ్యాన్సులతో, తన నటనతో పవర్ స్టార్‌గా ఎదిగి అశేషంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతడి మరణవార్తను చందన సీమే కాదూ దక్షిణాది పరిశ్రమ మొత్తం జీర్ణించుకోలేకపోయింది. అతడి మరణ వార్త నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో.. రాజ్ కుమార్ కుటుంబంలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి.
ఒక బాధను మర్చిపోయే లోపు మరో విషాద వార్త వినాల్సి వస్తుంది. పునీత్ నుండి తాజాగా చనిపోయిన స్పందన మరణం వరకు ఆ కుటుంబానికి షాకులు మీద షాకులు తగులుగున్నాయి. 2021, అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్.. ఫిట్ నెస్ చేస్తూ గుండె పోటుకు గురైన సంగతి విదితమే. ఆయన మరణ వార్తతో కన్నడ సినీ ప్రేక్షకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన చేసిన సేవలను గూర్చి తెలిసి నువ్వు దేవుడివి సామీ అంటూ ఆయన అంత్యక్రియల్లో తండోపతండాలుగా పాల్గొన్నారు. ఇక పునీత్ భార్య అశ్విని ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు. అతడి మరణం నుండి ఆ కుటుంబం అప్పుడే కోలుకుంటుందీ అనుకునేలోపు.. అశ్వినీ నాన్న, పునీత్ మామ రేవనాథ్ 2022 ఫిబ్రవరి 20న కన్నుమూశారు. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న అశ్వినీ.. తండ్రి కోల్పోవడంతో అందరూ విధిని తిట్టిపోశారు.
ఆ వేదన నుండి రాజ్ కుమార్ కుటుంబం కోలుకుంటుందీ అనుకున్న సమయంలో.. మరో సంఘటన. కన్నడ నటుడు సూరజ్ కుమార్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని కుడి కాలును వైద్యులు తొలగించారు. ఇతడు రాజ్ కుమార్ భార్య పార్వతమ్మకు స్వయానా మేనల్లుడు. పునీత్ కు బావ మరిది అవుతాడు. ఇప్పుడు పార్వతమ్మ మరో మేనల్లుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండె పోటుతో మరణించింది. బ్యాంకాక్ పర్యటనలో ఉండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. 2007లో ఆగస్టు 26 స్పందన, విజయ్ రాఘవేంద్రలకు వివాహం జరిగింది. మరో 19 రోజుల్లో వారి 16వ వివాహ వార్షికోత్సవం ఉండగా.. అంతలోనే ఆమె విగత జీవిగా మారింది. ఈ వరుస విషాదాలతో రాజ్ కుమార్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోతుంది.
ఇది చదవండి : బ్రేకింగ్ : ప్రముఖ నటుడి ఇంట్లో విషాదం.. గుండెపోటుతో భార్య మృతి