పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినీ అభిమానులనే శోక సంద్రంలో ముంచేసి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అతడు లేనప్పటికీ అప్పు(పునీత్ ముద్దు పేరు)ను తమ గుండెల్లో దేవుడిగా గుడి కట్టుకున్నారు అభిమాన గణం.
కన్నడ చిత్రపరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ అగ్రహీరో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఈ ఉదయం తీవ్ర గుండెపోటుకు గురైన పునీత్ రాజ్ కుమార్ బెంగళూరు విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనను బతికించేందుకు వైద్యులు అత్యంత తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. కన్నడిగుల ఆరాధ్య దైవం రాజ్ కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు. బాలనటుడిగా ప్రస్థానం ఆరంభించిన పునీత్ రాజ్ కుమార్ 1985లో […]