ఇటీవల కాలంలో గుండెపోటుతో సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం చనిపోతున్నారు. కరోనా పరిస్థితులే ఈవైపరిత్యానికి కారణమని కొంత మంది వాదన. ఏదీ ఏమైనప్పటికీ.. మహమ్మారి దాపురించిన తర్వాత.. చిన్న వయస్సులోనే హార్ట్ స్ట్రోక్ తో చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది
ఇటీవల కాలంలో గుండెపోటుతో సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం చనిపోతున్నారు. కరోనా పరిస్థితులే ఈవైపరిత్యానికి కారణమని కొంత మంది వాదన. ఏదీ ఏమైనప్పటికీ.. మహమ్మారి దాపురించిన తర్వాత.. చిన్న వయస్సులోనే హార్ట్ స్ట్రోక్ తో చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. మొన్న పునీత్ రాజ్ కుమార్ నుండి ఈ ఏడాది తారకరత్న వంటి యంగ్ నటులంతా గుండె పోటు కారణంగానే మరణించారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నితిన్ గోపీ కూడా ఈ జూన్‌లో గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. మరణించే సమయానికి అతడు వయస్సు కేవలం 30 సంవత్సరాలే. దర్శకుడు తరుణ్ భాస్కర్ స్వీయదర్శకత్వంలో ‘కీడా కోలా’తో సినీ పరిశ్రమకు ఎంట్రీ అవ్వబోతున్న థియేటర్ ఆర్టిస్ట్ హరికాంత్ అనే నటుడు కూడా దీనికి బాధితుడే.
తాజాగా కన్నడ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు ఇంట్లో విషాదం నెలకొంది. నటుడు, దర్శకుడు, ప్లేబ్యాక్ సింగర్ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన హార్ట్ ఎటాక్ కారణంగా మరణించారు. రాఘవేంద్ర.. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కు సమీప బంధువు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్లకు కజిన్. విజయ్, ఆయన కుటుంబం ఇటీవల బ్యాంకాక్ పర్యటనకు వెళ్లగా.. ఆమెకు హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడ ఆసుపత్రుల్లో చేర్చారు. చికిత్స తీసుకుంటూనే ఆమె తుదిశ్వాస విడిచారు. బీపీ తగ్గి, గుండె పోటు రావడంతో మరణించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో జన్మించారు స్పందన. ఆయన తండ్రి బికే శివరామ్ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా వ్యవహరించారు. 2007ఆగస్టు 26న స్పందన, విజయ్‌ల వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరికో కుమారుడు శౌర్య ఉన్నాడు. 2016లో వచ్చిన అపూర్వ అనే సినిమాలో గెస్ట్ రోల్ లో స్పందన కనిపించింది.