ఎప్పుడూ లేని విధంగా ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్ వేదికగా పలు సందర్భాల్లో మా ఎన్నికల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాడు. ప్రకాశ్‌రాజ్ వరుస ట్వీట్‌లు వైరల్ అవుతూనే ఉన్నాయి. మా ఎన్నికలు ఎప్పుడని ప్రశ్నించడం.. స్వాతంత్రదినోత్సవం రోజు జెండా ఎగరేద్దాం అంటూ చేసిన ట్వీట్లు వైరలయ్యాయి.
తాజాగా ప్రకాశ్‌రాజ్, మెగాస్టార్‌ను కలవడం. ఆ ఫోటోను ట్విట్టర్‌లో పంచుకోవడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఫొటో షేర్ చేస్తూ ‘పొద్దున్నే బాస్‌ను కలవడం జరిగింది. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపాను. అన్నయ్య ఎప్పటికీ ఆదర్శమే… నిన్ను పొందడం మా అదృష్టం’ అంటూ ప్రకాశ్‌రాజ్, చిరుపై ప్రశంసల జల్లు కురిపించారు. మా ఎన్నికల గురించే ప్రకాశ్‌రాజ్, చిరును కలిశాడని సినీ పరిశ్రమలో టాక్ మొదలైంది.
మా ఎన్నికల్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ హేమ వాయిస్ రికార్డింగ్ విడుదలవడంపై మా అసోసియేషన్ సీరియస్ అయ్యింది. క్రమశిక్షణ నియమావళి సంఘం షోకాజ్ నటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అధ్యక్ష పదవి అభ్యర్థులు పరస్పర ఆరపణలపై స్పందించిన మెగాస్టార్.. మా ప్రతిష్ట మసకబారుతుందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.