Prabhas: అసలే డార్లింగ్‌కి మొహమాటమెక్కువ. స్టేజ్‌పై మాట్లాడడానికే ఇష్టపడేవారు కాదు. ఇక హీరోయిన్స్ గురించి మాట్లాడడం అంటే కష్టమే. ఎప్పుడూ రిజర్వుడ్‌గా ఉండే ప్రభాస్ డార్లింగ్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు సినిమాల్లో నటించేంత వరకూ హీరోయిన్స్‌తో చనువుగా ఉన్నప్పటికీ.. షూటింగ్ అయిపోయాక మాత్రం హీరోయిన్స్ విషయంలో చాలా బిడియం ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాక మన బిల్లా పూర్తిగా మారిపోయారు. ‘యు ఛేంజిడ్ బిల్లా’ అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతలా ఫ్యాన్స్ అనడానికి కారణం లేకపోలేదు. సోషల్ మీడియాలో తన సినిమా అప్‌డేట్స్ గురించి తప్పితే మిగతా విషయాల పట్ల పెద్దగా ఆసక్తి కనబర్చని ప్రభాస్ ఏకంగా ఓ హీరోయిన్ కోసం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు, ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్‌తో జతకట్టిన కృతి సనన్‌నే. ఈమె గురించే ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశారు. తన పుట్టినరోజు(27 July 1990) కావడంతో కృతి సనన్‌కు ప్రభాస్ బర్త్ డే విషెస్ చెప్పారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు కృతి సనన్. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆదిపురుష్ సినిమాలో మీ మ్యాజిక్ ని ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను’ అంటూ క్యాప్షన్ పెట్టి కృతిసనన్ ఫోటో షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో బిజీగా ఉండగా.. ఆదిపురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి తన తోటి హీరోయిన్ గురించి ప్రభాస్ చేసిన ఈ పోస్ట్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
PAN INDIA Star #Prabhas birthday wishes to his co star @kritisanon via Instagram. ❤️ ✨#Adipurush #HappyBirthdayKritiSanon pic.twitter.com/7wNMUUnGeA
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 27, 2022