చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులకు ఎంత దగ్గరగా ఉంటే వారికి అంత ఫాలోయింగ్ ఉంటుంది. దానికి అనుగునంగానే నేడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది. దీంతో సినీ తారలు తమ అభిమానులతో ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను వాటి ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే హీరోయిన్ రాధికా ఆప్టే తన భర్త గురించి ఇన్ స్టాగ్రామ్ లో పలు వ్యాఖ్యలు చేయడంతో పాటు తన ఇష్టాలను పంచుకుంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలల్లోకి వెళితే.. రాధికా ఆప్టే.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. తన నటనతో, వ్యాఖ్యలతో ఎప్పుడు వివాదాలకు గురిఅవుతూ ఉంటుంది. గతంలో ఆమె నటించిన వెబ్ సిరీస్ లు, లీకైన న్యూడ్ వీడియోలతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే రాధికా ఆప్టే తాజాగా అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ వేదికగా చిట్ చాట్ చేసింది. దానిలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నిస్తూ..''మీకు మెసెజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వవు.. కదా? అని అడగ్గా.. ఆమె ఇంతకి నీ ప్రశ్న ఏంటి? అంది. అలానే చాలా మంది నెటిజన్స్ రాధికను పర్సనల్, కెరీర్ గురించి ప్రశ్నలు సంధించారు. నీ వాట్సప్ డీపీ ఏంటీ? ఫోన్ వాల్ పేపర్ ఏంటీ? వంటి రకరకాల ప్రశ్నలు అడిగారు. దాంతో ఆప్టే తన వాల్ పేపర్ తోపాటు డీపీని సైతం అభిమానులకు చూపించింది. ఓ నెటిజన్ చిలిపిగా నీ వయసు ఎంత? అని అడగగా.. తన ఏజ్ ఈ సెప్టెంబర్ వస్తే 37 సంవత్సరాలు అని తెలిపింది. అదీకాక ఇప్పుడు తాను ముంబాయిలోని బాంద్రాలో ఉన్నానని, షూటింగ్స్ లో బిజీగా ఉన్నట్లు వివరించింది. మీ అభిమాన సహ నటుడు ఎవరు అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ తో దిగిన ఫొటోను చూపించింది. ఇక తన భర్తలో నచ్చని విషయం ఏంటి? అని అడిగితే.. అతను నాకంటే పొడుగ్గా ఉంటాడు అదే నచ్చదు అని తెలిపింది. మరి తన మనసులోని భావాలను అభిమానులతో పంచుకున్న రాధికా ఆప్టే పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #RadhikaApte pic.twitter.com/G7WLeJv1kj — Hardin (@hardintessa143) July 27, 2022 ఇదీ చదవండి: టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి రామ్ చరణ్! ఇదీ చదవండి: వంశీ పైడిపల్లి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు..