టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకరు. విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తూ.. ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాందించారు. "మున్నా" సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ.. బృందావనం, ఎవడు, ఊపిరి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఈ శుక్రవారం వంశీ పైడిపల్లి పుట్టినరోజు. టాలీవుడ్ సినీ ప్రముఖులు వంశీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వంశీ పైడిపల్లి బర్త్ డే విషెష్ తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు సూపర్ స్టార్ అయినప్పటికీ ప్రతి దర్శకుడిని గురువులా గౌరవిస్తారు. వారి మాటని నమ్మి, పాటిస్తారు. అందుకే అందరూ మహేష్ బాబును దర్శకుల హీరో అని పిలుస్తుంటారు. అందుకు నిదర్శనమే ఈ రోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటో. వంశీ పైడిపల్లి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు మహేశ్‌బాబు శుభాకాంక్షలు చెప్పారు. "పుట్టిన రోజు శుభాకాంక్షలు బ్రదర్. రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారను" అని మహేశ్ ట్వీట్ చేశారు. మహేష్ బాబు నటించిన "మహర్షి" సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం దళపతి విజయ్ తో దిల్ రాజు తీయబోయే సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం మహేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Happy birthday brother @directorvamshi! Wishing you a fun-filled and successful year ahead! — Mahesh Babu (@urstrulyMahesh) July 27, 2022 ఇదీ చదవండి: టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి రామ్ చరణ్! ఇదీ చదవండి: Anchor Syamala: యాంకర్ శ్యామల హోం టూర్! డ్రీమ్ హోం అదిరింది!