ప్రభాస్ 'ప్రాజెక్ట్ k' సినిమాకు రిలీజ్ డేట్ మారింది. తొలుత ఈ ఏడాది సెప్టెంబరులో థియేటర్లలోకి వస్తుందన్నారు. తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసి కొత్త డేట్ ని అనౌన్స్ చేశారు.
డార్లింగ్ ప్రభాస్ తీస్తున్న సినిమాల్లో బాగా ఆసక్తి రేపుతున్న సినిమా ‘ప్రాజెక్ట్ k’. ‘మహానటి’ లాంటి అద్భుతమైన మూవీ తర్వాత నాగ్ అశ్విన్ తీస్తున్న చిత్రమిది. పూర్తిస్థాయి అడ్వాన్స్ డ్ టెక్నాలజీ స్టోరీతో ఈ సినిమా తీస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రమిదని తెలుస్తోంది. ఇక ఈ మూవీని 2023 సెప్టెంబరులోనే రిలీజ్ చేస్తారని తొలుత ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీని మార్చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించారు. దీన్ని చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పటినుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ ని ప్రభాస్ ఒప్పుకొన్నాడు. అందులో ఒకటి ‘ప్రాజెక్ట్ K’. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో తీస్తున్న ఈ సినిమా టైమ్ ట్రావెల్ కథతో ఉండనుందని తెలుస్తోంది. టైటిల్ K అంటే కర్ణ అని.. హీరో పేరు అదే అయ్యిండొచ్చని సోషల్ మీడియాలో టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇది స్టోరీ అని ఒక్కరు కూడా గెస్ చేయలేకపోతున్నారు. తాజాగా శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ మరో క్రేజీ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఇందులో భాగంగా ముగ్గురు వ్యక్తులు… ఓ పెద్ద చేయి ఆకారాన్ని గన్స్ తో గురిపెడుతూ కనిపించారు. చుట్టూ కూడా శిథిలమైన భవనాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉండగా ఇందులో ప్రభాస్ కు హీరోయిన్ గా దీపికా పదుకొణె నటిస్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. మిగతా టెక్నికల్ టీమ్ ఎవరూ ఏంటనేది తెలియాల్సి ఉంది. మరి ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ఓకేనా లేదా అనేది కింద కామెంట్ చేయండి.
𝟏𝟐-𝟏-𝟐𝟒 𝐢𝐭 𝐢𝐬! #𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐊
Happy Mahashivratri.#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/MtPIjW2cbw
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 18, 2023