అసలు Project K అంటే ఏంటి?. ‘కల్కి’, ‘కాలచక్ర’, ‘కలియుగ్’ ఇలా పలు పేర్లు ప్రచారం చేశారు. ఆ సస్పెన్స్‌కి తెరదించుతూ ‘‘ప్రాజెక్ట్ కే’.. కే ఫర్ కల్కి. కల్కి 2898 ఏడీ’ అంటూ టైటిల్ రివీల్ చేశారు.
టాలీవుడ్ రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్ ప్రభాస్, బిగ్‌బి అమితాబ్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం.. Project K. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ అర్థరాత్రి (జూలై 21) శాన్ డియాగో కామిక్ కాన్-2023 వేడుకల్లో ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందరినోటా ఒకటే మాట ‘మైండ్ బ్లోయింగ్’. అసలు Project K అంటే ఏంటి?. ‘కల్కి’, ‘కాలచక్ర’, ‘కలియుగ్’ ఇలా పలు పేర్లు ప్రచారం చేశారు. ఆ సస్పెన్స్‌కి తెరదించుతూ ‘‘ప్రాజెక్ట్ కే’.. కే ఫర్ కల్కి. కల్కి 2898 ఏడీ’ అంటూ టైటిల్ రివీల్ చేశారు.
ఇక గ్లింప్స్ అయితే గూస్ బంప్స్ అసలు. హాలీవుడ్ రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా విజువల్ వండర్‌లా, ఓ డిఫరెంట్ వరల్డ్‌ని క్రియేట్ చేశారు నాగ్ అశ్విన్. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. ఇప్పటి వరకూ ఎవరూ చూపించని విధంగా డార్లింగ్‌ని ప్రజెంట్ చెయ్యనున్నారు. భవిష్యత్తు – వర్తమానం మధ్య జరిగే కథగా.. విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కిగా ప్రభాస్ కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కి రెబల్ స్టార్, నాగ్ అశ్విన్, కమల్ హాసన్, అశ్వినీ దత్, రానా తదితరులు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా నాగ్, ఫైనల్లీ ఇండియన్ మైథాలజీని ఇక్కడి వరకు తీసుకొచ్చామంటూ ఎగ్జైట్ అవుతూ చెప్పుకొచ్చారు.
‘హాలీవుడ్ వాళ్లకి స్పేస్‌లో దూసుకుపోయే సూపర్ హీరోలంటే ఇష్టం. థోర్, హల్క్ వంటి వారున్నారు. వారు బిల్డింగ్‌లను మట్టి కరిపిస్తారు. మాకు ఆంజనేయుడున్నాడు. సూర్యుడిని తింటాడు. పర్వతాలను ఎత్తుతాడు’ అంటూ కుంభకర్ణుడి గురించి కూడా చెప్పారు. అలాగే టైటిల్ గ్లింప్స్‌లో కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు అనడిగితే.. వీడియో ఆయనతోనే స్టార్ట్ అవుతుంది. ప్రతి చోటా ఆయన ఉన్నారు అంటూ కన్ఫ్యూజన్‌లో పడేశారు. దీని గురించి కూడా సామాజిక మాధ్యమాలలో రకరకాల వార్తలు వస్తున్నాయి.