కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ నెలలో అకస్మాతుగా గుండె పోటుతో మరణించారు. దీంతో యావత్ సినీ ప్రపంచం పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించింది. నటుడిగానే కాకుండా ఆయన చేసిన సేవలు యావత్ భారత దేశం కొనియాడారు. తాజాగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మరణానంతరం డాక్టరేట్ వచ్చింది. మైసూర్ యూనివర్సిటీ రాజ్ కుమారకు డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. మైసూర్ యూనివర్సిటీ 102వ స్నాతకోత్సవంలో భాగంగా పునీత్ రాజ్ కుమార్ కు డాక్టరేట్ ను ప్రధానం చేశారు. పునీత్ రాజ్ కుమార్ కు డాక్టరేట్ ఇవ్వడానికి ముందు.. క్రాఫోర్డ్ హాల్ లో పునీత్ రాజ్ కుమార్ ఫోటోలను ఎల్ఈడీ తెరపై ప్రదర్శించారు.
ఈ అవార్డును పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వనికి ప్రధానం చేశారు. అనంతరం గౌరవ డాక్టరేట్ అవార్డును పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వనికి ప్రధానం చేశారు. ఇటీవల పునీత్ రాజ్ కుమార్ చివరి సారిగా నటించిన జేమ్స్ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా విడుదల అయ్యే సమయంలో కన్నడలో ఏ సినిమా విడుదల చేయకుండదని.. నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కన్నడలో అన్ని థీయేటర్లలో జేమ్స్ సినిమా విడుదల అయింది. దీంతో అనేక రికార్డులు పునీత్ రాజ్ కుమార్ పేరిట నెలకొన్నాయి.