భారత్-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం పార్ల్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా 7 వికెట్లతో విజయం సాధించింది. దీంతో మూడో వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక కేప్ టౌన్‌లో జరిగే చివరి వన్డేతో భారత్, దక్షిణాఫ్రికా పర్యటన ముగుస్తుంది. కాగా రెండో వన్డే ఓటమి తర్వాత టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మీడియాతో మాట్లాడారు.
“మొదటి వన్డేలో, మేం ఛేజింగ్ చేశాం. రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేశాం. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో కాస్త నెమ్మదించింది. రెండో వన్డేలోనూ అదే కనిపించింది. కానీ, దక్షిణాఫ్రికా మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో మేం విఫలమయ్యాం” అని పేర్కొన్నాడు.
అశ్విన్, చాహల్ కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లు మెరుగ్గా బౌలింగ్ చేశారని అన్నాడు. కేశవ్ మహారాజ్, ఐడెన్ మర్క్రామ్, తబ్రేజ్ షమ్సీ మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసినట్లు పేర్కొన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో మా లోపాలను సరిదిద్దుకుని క్లీన్ స్వీప్ కాకుండా చూసుకుంటాం అని తెలిపాడు. మరి పంత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ధోని, ద్రవిడ్ రికార్డులను బద్దులుకొట్టిన రిషభ్ పంత్