ఈ ఏడాది సెలబ్రిటీల మరణవార్తలు అభిమానులను కుదిపేశాయి. ఒకరి మరణవార్తని మరిచేలోపే మరొకరు.. ఇలా వరుసగా 2022లో చాలామంది లెజెండ్స్ ని ఇండస్ట్రీ కోల్పోయింది. మరోవైపు ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినా సెలబ్రిటీ హోదా కలిగిన వారు ఎంతోమంది వివిధ కారణాలతో కన్నుమూశారు. ముఖ్యంగా టాలీవుడ్ లో లెజెండరి యాక్టర్స్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, జనార్దన్ లను కోల్పోయారు ప్రేక్షకులు. కోలీవుడ్, బాలీవుడ్, ఆఖరికి హాలీవుడ్ లో ఎందరో హేమాహేమీలు చనిపోయారు. ఈ క్రమంలో తాజాగా మరో సెలబ్రిటీ, యూట్యూబర్ మరణవార్త వరల్డ్ వైడ్ యూట్యూబ్ ఫ్యాన్స్ ని బాధిస్తోంది.
అమెరికన్ యూట్యూబ్ స్టార్ కీనన్ కాహిల్.. డిసెంబర్ 29న ఓపెన్ హార్ట్ సర్జరీతో కన్నుమూశారు. సర్జరీ జరిగిన రెండు వారాల తర్వాత కూడా అతని ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి బెటర్ మెంట్ కనిపించలేదు. ఈ క్రమంలో ఆఖరికి బెడ్ పైనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కీనన్.. ఇప్పటివరకు చాలా సర్జరీలు చేయించుకున్నాడట. ప్రస్తుతం కీనన్ వయసు 27 సంవత్సరాలు. అతను పుట్టిన ఏడాది వయసు నుండి మరోటెక్స్-లామీ(Maroteaux-lamy) సిండ్రోమ్ అనే ఇమ్యూన్ డిజార్డర్ తో పోరాడుతున్నాడని సమాచారం. వైద్యుల విశ్లేషణ ప్రకారం.. మరోటెక్స్-లామీ సిండ్రోమ్ కణజాలం, అవయవాల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది.
ఇక కీనన్ మరణవార్తను తెలియజేస్తూ.. అతని ఫ్యామిలీ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా నివాళి అర్పించింది. కీనన్ అంత్యక్రియల ఖర్చుల కోసం నిధులను సేకరించేందుకు ‘GoFundMe’ పేజీని కూడా ప్రారంభించారు అతని గ్రాండ్ మదర్ కేటీ ఓవెన్స్. మార్చి 20, 1995 న జన్మించిన కాహిల్ అతను పుట్టినప్పటి నుండి మ్యూకోపాలిసాకరిడోసిస్ తో బాధపడుతున్నాడు. 13 ఏళ్లకే ఐమ్యాక్ అందుకొని.. 18 ఏళ్లకే యూట్యూబ్ లో స్టార్ సెలబ్రిటీ అయిపోయాడు. సింగింగ్ వీడియోలతో పాటు లిప్ సింకింగ్ వీడియోల ద్వారా కీనన్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. కీనన్ కి యూట్యూబ్ లో 7 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అంతలోనే ఇలా కీనన్ లేడనే వార్తను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి కీనన్ మృతి పట్ల మీ సంతాపాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.