నటి పూర్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సీమ టపాకాయ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత అవును సీరిస్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. కెరీర్లో ముందుకు సాగుతుంది పూర్ణ. ఇవే కాక బుల్లితెర మీద పలు షోలకు జడ్జీగా కూడా వ్యవహరిస్తోంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. కొన్ని రోజుల క్రితం పూర్ణకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీతో ఆమెకు వివాహం నిశ్చయమయ్యింది. తాజాగా సోమవారం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా పూర్ణ వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పూర్ణ, ఆసిఫ్ అలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా అక్కడే నిర్వహించారు.
తన పెళ్లి ఫొటోలను షమ్నా కాసిం ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది పూర్ణ. అంతేకాదు, ఈ పోస్ట్‌లో తన భర్తను ఉద్దేశించి ఎంతో గొప్పగా రాసుకొచ్చింది ‘‘నేను ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళను కాకపోవచ్చు. అలానే మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సి లక్షణాలు నాలో లేకపోవచ్చు. కానీ మీరు నన్ను.. మీకంటే నేను తక్కువ అనుకునేలా ఏనాడు ప్రవర్తించలేదు.. నొప్పించలేదు. నేను ఎలా ఉన్నానో అలానే మీరు నన్ను ఆరాధించారు. నన్ను మార్చడానికి ఏనాడూ ప్రయత్నించలేదు.. మారమని నాకు చెప్పలేదు. నాలోని ఉత్తమ ప్రతిభను బయటికి తీసుకురావడానికి మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈరోజు మనకెంతో ప్రియమైన, సన్నిహితమైన వారి మధ్య మీరూ, నేను కలిసి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు, సందర్భాలు ఎదురయినా సరే..నేను మీకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను’’ అని రాసుకొచ్చింది పూర్ణ. ప్రస్తుతం ఈ పోస్ట్, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
గతంలో పూర్ణ నిశ్చితార్థం రద్దు చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. ఇక కొన్ని రోజుల క్రితం నుంచి ఆమె సీక్రెట్‌గా వివాహం చేసుకుందని.. కేరళలో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసిందంటూ బోలేడు వార్తలు వచ్చాయి. వాటన్నింటికి తన పోస్ట్‌తో చెక్ పెట్టింది పూర్ణ. ప్రసుత్తం పూర్ణ వెబ్ సిరీస్‌లు, సినిమాలు, బుల్లితెర మీద షోలు చేస్తూ చాలా బిజీగా ఉంది. మరి పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కంటిన్యూ చేస్తుందో లేక మానేసి.. దుబాయ్‌లో సెటిల్ అవుతుందో చూడాలి.