ఏ చిన్న ఆనంద క్షణాన్ని అయినా పంచుకోవడానికి వేదిక సోషల్ మీడియా. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా వేదిక ఏదైనా గానీ ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. గర్భవతి అయిన తర్వాత కూడా గ్లామరస్ ఫోటోషూట్స్ ని వదలడం లేదు. బేబీ బంప్ తో కూడా ఫోటోషూట్ చేసి.. దానికొక అందాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ, తెలుగు నటి బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. భర్తతో కలిసి రొమాంటిక్ గా ఫోజులిచ్చింది.
లవ్ ఫెయిల్యూర్, స్వామిరారా, అడవి కాచిన వెన్నెల వంటి సినిమాల్లో కర్లీ హెయిర్ తో ఎట్రాక్ట్ చేసిన పూజా రామచంద్రన్.. ప్రస్తుతం గర్భవతిగా మధుర క్షణాలను ఆస్వాదిస్తోంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా బిగ్ బాస్ షో ద్వారా అందరికీ బాగా సుపరిచితురాలు అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌజ్ లో అడుగుపెట్టిన పూజా రామచంద్రన్.. కంటిస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చింది. ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటినప్పటికీ పూజా గేమ్ అక్కడ నిలబడలేకపోయింది. దీంతో ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత వెంకీ మామ, ఎంత మంచివాడవురా, పవర్ ప్లే వంటి సినిమాల్లో నటించింది.
తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా గానీ నటిగా ప్రూవ్ చేసుకునే పాత్ర పడలేదు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. కానీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటుంది. 2010లో వీజే క్రెగ్ ను పెళ్లాడిన పూజా.. 2017లో విడాకులు ఇచ్చేసింది. 2019లో జాన్ కొక్కెన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. త్వరలో ఈ దంపతులిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె గతంలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. గర్భవతిగా ఉంటూనే ఆమె యోగా, వ్యాయామాలు చేస్తుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇటీవల సీమంతం ఫోటోలను కూడా అప్లోడ్ చేసింది.
తాజాగా ప్రీ డెలివరీ ఫోటో షూట్ దిగింది. ఆ ఫోటోలను ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. బీచ్ ఒడ్డున ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో బేబీ బంప్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. అంతేకాదు ‘మీ సమయం అనేది పరిమితం. కాబట్టి మరొకరి జీవితంలో జీవించడం కోసం వెచ్చించకండి. ప్రతి క్షణం స్వాధీనం చేసుకోండి’ అంటూ రాసుకొచ్చింది. అలానే తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. జిగేలుమని మెరిసే డ్రెస్సులో భర్తతో కలిసి ఫోటోలు దిగింది. ఈ ఫోటోల్లో బేబీ బంప్ తో భర్తకు లిప్ లాక్ ఇచ్చింది పూజా రామచంద్రన్. పూజా రామచంద్రన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ఈ కపుల్స్ కి అభినందనలు తెలియజేస్తున్నారు.