ఇండస్ట్రీలో ఎన్ని హిట్స్ ఉంటే అన్ని అవకాశాలు తలుపు తడతాయి. వరుసగా కాకపోయినా గ్యాప్ ఇస్తూ ప్లాప్స్ పడితే అవకాశాలు వచ్చే ఛాన్స్ 50-50 ఉంటుంది. అదే వరుసగా రెండు లేదా అంతకుమించి ప్లాప్స్ పడ్డాయంటే కెరీర్ సందిగ్ధంలో పడినట్లే. ప్రస్తుతం స్టార్ హీరోయిన్.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది.
సినీ ఇండస్ట్రీ అంటేనే.. ఎప్పుడు ఎవరి కెరీర్ లో ఎలాంటి మలుపు తిరుగుతుందో.. లేక ఎప్పుడు ఎలా గ్రాఫ్ పడిపోతుందో ఎవరం చెప్పలేం.. కనీసం అంచనా కూడా వేయలేం. కానీ.. ఎవరి కెరీర్ ని వారు డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆయా నటీనటులపైనే ఉంటుంది. ఇదివరకంటే.. హీరోయిన్స్ సంఖ్య తక్కువగా ఉండేది కాబట్టి.. హిట్స్, ప్లాప్స్ చూడకుండా అవకాశాలు ఇచ్చేవారు. ఇప్పుడలా లేదు. ఎన్ని హిట్స్ ఉంటే అన్ని అవకాశాలు తలుపు తడతాయి. వరుసగా కాకపోయినా గ్యాప్ ఇస్తూ ప్లాప్స్ పడితే అవకాశాలు వచ్చే ఛాన్స్ 50-50 ఉంటుంది. అదే వరుసగా రెండు లేదా అంతకుమించి ప్లాప్స్ పడ్డాయంటే కెరీర్ సందిగ్ధంలో పడినట్లే.
ప్రస్తుతం స్టార్ హీరోయిన్.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది. గతేడాది రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలతో హిందీలో రణవీర్ సింగ్ కి జంటగా నటించిన ‘సర్కస్’ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అప్పటినుండి అమ్మడి కెరీర్ అనుమానంలో పడినప్పటికీ.. చేతిలో మహేష్ బాబు, సల్మాన్ ఖాన్ సినిమాలు ఉండటంతో కాస్త ధైర్యంగా ఉంటోంది. అందులోను సల్మాన్ సినిమా అంటే.. చెప్పలేం గాని, తెలుగులో మహేష్ కంటే ఎక్కువగా త్రివిక్రమ్ నే నమ్ముకొని ఉందట బ్యూటీ. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే.. స్టార్డమ్ వచ్చాక రెమ్యూనరేషన్ అనేది కొంచం ప్రెస్టేజియస్ విషయం అవుతుంది.
ఆ విషయం ఆలోచిస్తూనే ఇప్పుడు కొత్త సినిమాలు ఓకే చేయడానికి వెనుకాముందు అవుతోందట పూజా. హిట్స్ లో ఉన్నప్పుడు వచ్చే రెమ్యూనరేషన్ ఒకలా ఉంటుంది.. అదే ప్లాప్స్ పడితే.. వరుసగా నాలుగు ప్లాప్స్ పడ్డాక కూడా రెమ్యూనరేషన్ విషయంలో మొండిగా ప్రవర్తిస్తే అవకాశాలు వస్తాయో రావో చెప్పలేం. అలాగని వేరే ఆప్షన్ లేకపోలేదు. రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే మళ్లీ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని సినీవర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలిసిందేగా.. హిట్స్ లో ఉంటే గోల్డెన్ లెగ్.. ప్లాప్స్ లో ఉంటే ఐరన్ లెగ్. ప్రెజెంట్ పూజా ఏ లెగ్గులో ఉందో చెప్పక్కర్లేదు. సో.. ఆఫర్స్ రావాలంటే రెమ్యూనరేషన్ లో డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పుడైతే మహేష్, సల్మాన్ సినిమాలు తప్ప పూజ చేతిలో ఏం లేవు. సో.. చూడాలి మరి త్వరలో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనుందేమో!