దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ది కశ్మీర్ ఫైల్స్‘ సినిమాపై చర్చ జరుగుతోంది. 1990లలో కాశ్మీర్ లోయ నుండి పండిట్ల వలస నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో ‘సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్’గా నిలిచింది. అయితే.. కశ్మీర్ ఫైల్స్ మూవీని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్స్ కోసం వెతికే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా నోయిడా అడిషనల్ డిప్యూటీ కమీషనర్ రణ్విజయ్ సింగ్.. ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా డౌన్లోడ్ కోసం జరుగుతున్న వాట్సాప్ మోసాలపై ప్రేక్షకులకు వార్నింగ్ ఇచ్చారు.
తాజా సమాచారం ప్రకారం.. వాట్సాప్ లో వచ్చే ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా డౌన్ లోడ్ లింక్స్ ఓపెన్ చేస్తే.. సైబర్ నేరగాళ్లు యూజర్ల మొబైల్ డేటాను, అలాగే బ్యాంకు ఖాతా నెంబర్స్ హ్యాక్ చేసి డబ్బులు కొట్టేసే అవకాశం ఉంది. హ్యాకర్లు ప్రస్తుతం ఫేక్ మూవీ లింకులతో.. ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని ఉచితంగా డౌన్ లోడ్ చేయాలంటే క్లిక్ చేయమని యూజర్లను మభ్యపెడుతున్నారు. ఈ విధమైన సైబర్ ఉచ్చులో పడి కొందరు బాధితులు రూ. 30 లక్షలు పోగొట్టుకున్నారని, ఆ కొందరు కూడా ఒకేరోజు ఒకే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసినట్లు అయన తెలిపారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాకి సంబంధించి వాట్సాప్ లింక్స్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.