పవన్ కళ్యాణ్ హీరోగా అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమాలో పవన్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో పవన్ పోలీస్ డ్రెస్ ధరించి నిలుచున్నాడు. ఈ లుక్ తో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఇందులో పవన్ బీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఇక తాజాగా చిత్రానికి సంబందించిన ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్స్, షూటింగ్ లో బిజీగా ఉన్న త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ చంద్ర కొందరు నటీ, నటులు కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో పవన్ నడిచొస్తున్న లుక్స్ అదిరిపోయాయి.
ఈ వీడియోతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ వీడియోలో తెలిపింది. ఇందులో పవన్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్, సాయి పల్లవి నటిస్తున్నారు.