పవన్ కళ్యాన్ ఒక నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు. ఏపిలో జనసేన పార్టీ ఇటీవల మరణించిన కౌలు రైతుల కోసం ‘కౌలు రైతు భరోసా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాన్. అయితే పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ సైతం వెన్నుదన్నుగా నిలుస్తుంది.
ఏపిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు జిల్లాలు పర్యటిస్తూ ‘కౌలు రైతు భరోసా’ కార్యక్రమంలో భాగంగా పలు రైతు కుటుంబాలను కలుస్తున్నారు. వారిని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపుతూ ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. అయితే పవన్ కళ్యాన్ చేస్తున్న గొప్ప పనికి ఆయన కుటుంబ సభ్యుల నుంచి మంచి సహాయం అందుతుంది. ఈ మద్య నాగబాబు-పద్మజ, పవన్ సోదరి మాధవి మెగా హీరోలు, నిహారిక ఆర్థిక సహాయాన్ని అందించారు.
కొణిదెల వెంకట్రావు జయంతి సందర్భంగా పవన్ తల్లి అంజనా దేవి తన వంతుగా సాయం అందజేశారు. రూ.1.50 లక్షలను కౌలు రైతు భరోసాకు ఆర్థిక సహాయం అందజేశారు. దీనితో పాటు మరో లక్ష రూపాయలను జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును హైదరాబాద్ లో ఆమె అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన తల్లికి పెన్షన్ వస్తుందని.. ఆ డబ్బులు దాచి పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారని.. ఇందులో భాగంగా కౌలు రైతు కుటుంబాలకు విరాళం అందించడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
జనసేన కౌలు రైతు భరోసాకు అమ్మ సాయం
Video Link: https://t.co/4S7pyEtTLD pic.twitter.com/477BID53lj
— JanaSena Party (@JanaSenaParty) June 25, 2022