పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పవన్ కి త్రివిక్రమ్ మంచి స్నేహితుడు అన్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక త్రివిక్రమ్ శ్రీనివాస్ కి, పవన్ ల మధ్య ఆన్ స్క్రీన్ బాండింగ్ అనేది కనిపించలేదు. జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కి ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పీచ్ ల విషయంలో సహాయం చేశారు. పవన్ వ్యక్తిత్వం గురించి కూడా కొన్ని సందర్భాల్లో పొగిడారు. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కి దూరమయ్యారు. పవన్ కళ్యాణ్ కి ప్రత్యక్షంగా త్రివిక్రమ్ మద్దతు పలుకుతారేమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ తన సినిమాలతో బిజీ అయిపోయారు.
ఇటు పవన్ కళ్యాణ్.. సినిమాలు, రాజకీయాలు చేసుకుంటూ ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందేమోనన్న సందేహం కూడా రాకుండా ఉండదు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గొడవ ఈరోజుకీ ఉందని.. ఇప్పటికీ తేలలేదని అన్నారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముందుగా ఫిబ్రవరి 3న రిలీజ్ చేయాలని అనుకున్నారు. రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఫ్యాన్స్ ఆతురతను అర్థం చేసుకుని ఒకరోజు ముందుగానే మొదటి భాగాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఆహాలో పవన్ ఎపిసోడ్ మొదటి భాగం స్ట్రీమింగ్ అవుతోంది. షోలో భాగంగా బాలకృష్ణ.. పవన్ పై అనేక ప్రశ్నలు సంధించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కి, నీకు ఫ్రెండ్ షిప్ ఎలా కుదిరింది అని బాలకృష్ణ అడగ్గా.. తనకు, త్రివిక్రమ్ కి గొడవ ఉందని పవన్ అన్నారు. ‘మేమిద్దరం ఫ్రెండ్స్ అవ్వాలనుకోలేదు కానీ అవ్వాల్సి వచ్చింది. మొదటిసారి ఆయన కథ చెప్తున్నప్పుడు.. అతడు కథ అని తెలియదు. ఈరోజుకీ మా ఇద్దరి మధ్య గొడవ ఉంది. నేను అతడు కథ నీకు చెప్తున్నప్పుడు నువ్వు నిద్రపోయావ్ అని త్రివిక్రమ్ అంటే.. నేనేమీ నిద్రపోలేదు, మెలుకువగానే ఉన్నాను అని నేను అంటాను. ఈరోజుకీ ఆ గొడవ తెగలేదు’ అని అన్నారు. కాలక్రమేణా మేమిద్దరం పుస్తక పఠనం, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాలు చర్చించుకుంటామని, సినిమాల కంటే పురాణాలు, కవిత్వాలు వంటి వాటి గురించే ఎక్కువగా ఉంటుందని.. త్రివిక్రమ్ ని నేను గురువుగానే భావిస్తానని పవన్ అన్నారు. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.