‘భీమ్లానాయక్’.. పవన్ కల్యాణ్– రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు భీమ్లానాయక్ టీమ్ పవన్ అభిమానులకు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఎదురుచూస్తోంది.. భీమ్లానాయక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అని. అదే విషయంపై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒక ఓటీటీ కాదు, ఒకేసారి రెండు ఓటీటీల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి: ఐశ్వర్యపై ధనుష్ వైరల్ ట్వీట్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
అవును భీమ్లానాయక్ సినిమాని రెండు ఓటీటీల్లో విడుదల చేయనున్నారు. మార్చి 25 నుంచి భీమ్లానాయక్ సినిమా ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ సినిమాకి రీమేక్ గా తెలుగులో భీమ్లానాయక్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. నిత్యామేనన్, సంయుక్తా మేనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. భీమ్లానాయక్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.