ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అభిమాన దర్శకులు, తారలు, నిర్మాతలు చనిపోతుండటంతో ఫ్యాన్స్ ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నారు.
సినీ పరిశ్రమలో వరుస విషాదలు చోటుచేసుకుంటున్నాయి. తమ అద్భుతమైన ట్యాలెంట్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటులు, దర్శకులు, నిర్మాతలు చనిపోతుండటం తీవ్ర బాధాకరం. మూవీ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు యశ్ చోప్రా సతీమణి పమేలా చోప్రా కన్నుమూశారు. 74 ఏళ్ల పమేలా.. గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. యశ్ చోప్రా భార్యగానే గాక తన సొంత ప్రతిభతో పేరు తెచ్చుకున్నారు పమేలా. ఆమె గాయని కావడం విశేషం. సింగర్‌గానే కాక సినీ రచయితగా, నిర్మాతగానూనూ కళామతల్లికి ఆమె సేవలు అందంచారు. ‘దిల్ తో పాగల్ హై’, ‘ఐనా’ చిత్రాలను పమేలా నిర్మించారు. పలు అనారోగ్య కారణాల వల్ల 15 రోజుల కింద ఆమెను ఆస్పత్రిలో చేర్చారని తెలుస్తోంది.
ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో పదిహేను రోజుల కింద పమేలా చోప్రాను అడ్మిట్ చేశారని బాలీవుడ్ మీడియా సమాచారం. అయితే ఎంతకీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. వెంటిలేటర్ మీద ఉంచినా ప్రయోజనం లేకపోయిందని తెలిసింది. ఇవాళ ఉదయం ఆమె ప్రాణాలు విడిచారు. ముంబైలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పమేలా మృతిపై బాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. ఇకపోతే, గాయనిగా పమేలా చోప్రా మంచి పేరు గడించారు. ఆమె పాడిన వాటిల్లో దాదాపుగా అన్ని పాటలు భర్త యశ్ చోప్రా సినిమాలకే కావడం గమనార్హం. 1976లో తెరకెక్కిన కభీ కభీ నుంచి 2002లో వచ్చిన ముఝ్సే షాదీ కరోగీ చిత్రం వరకు ఆమె ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించారు. కాగా, యశ్ చోప్రా 2012లోనే మృతి చెందిన విషయం విదితమే.
Our deepest condolences to the family. 🙏
R.I.P. #PamelaChopra pic.twitter.com/sYIyCB0T0b— T-Series (@TSeries) April 20, 2023