విశాఖపట్నంలో పుట్టి పెరిగిన టాలెంటెడ్ మిక్స్ ఇంజనీర్ పీఏ దీపక్. పూర్తి పేరు అదృష్ట దీపక్ పల్లికొండ. ఈయన గిటారిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. సంగీత ప్రపంచంలో కొత్త ప్రయోగాలు చేస్తూ హాలీవుడ్ స్థాయికి ఎదిగారు. సంగీత ప్రపంచంలో అత్యుత్తమ అవార్డుగా భావించే గ్రామీ అవార్డును రెండు సార్లు అందుకున్నారు. తన ప్రతిభతో ఏఆర్ రెహమాన్ దగ్గర శిష్యుడిగా చేరి, ప్రియ శిష్యుడయిపోయారు దీపక్. 5వ తరగతి నుండే గిటార్ వాయించడం నేర్చుకున్న దీపక్.. వైజాగ్‌లోని సెయింట్ లూక్ రికార్డింగ్ స్టూడియోలో మ్యుజీషియన్‌గా జర్నీ స్టార్ట్ చేశారు. మొదటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండడంతో ఆయన ఈ స్థాయికి చేరుకోగలిగారు. పీఏ దీపక్ తండ్రి ఒక ప్రొఫెసర్. ఆయన అగ్రికల్చరల్ ఫోక్ సాంగ్స్‌లో పీహెచ్‌డీ కూడా చేశారు. ఆ సమయంలో ఆయన ప్రపంచదేశాలకు చెందిన రకరకాల పాటలు వినేవారు. ఆ పాటలు వింటూ పెరిగిన దీపక్‌కు క్రమంగా సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. దీపక్ ఇంటెదురుగా ఉన్న గుడిలోకి వెళ్ళి అక్కడ భక్తి పాటలు వినేవారు. ఆ తర్వాత సినిమా పాటలు వినడం మొదలుపెట్టారు.
అప్పటికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా పాటలు దేశమంతా మార్మోగిపోతున్నాయి. అందరూ ఆయన పాటలు విని ఆస్వాదిస్తుంటే.. దీపక్ మాత్రం ఆ పాటల్లో ఉన్న సౌండింగ్‌ను శ్రద్ధగా ఆలకించేవారు. ఇళయరాజా పాటల్లో ఎక్కువగా వినిపించే గిటార్ సౌండ్‌ను దీపక్ పట్టుకున్నారు. అంతే ఎలాగైనా గిటార్ నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. అలా ఏడేళ్ళ వయసులో గిటార్ నేర్చుకోవడం మొదలుపెట్టిన దీపక్.. ఇవాళ దేశం గర్వించతగ్గ మిక్సింగ్ ఇంజనీర్‌గా ఎదిగారు. గిటారిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన పీఏ దీపక్.. కొన్నాళ్ళు రికార్డింగ్ ఇంజనీర్‌గా చేశారు. మ్యూజిక్ మిక్సింగ్, సౌండ్ రికార్డింగ్‌లో నైపుణ్యం సంపాదించిన ఆయనకి అనుకోకుండా రెహమాన్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. రెహమాన్ ప్రొడ్యూస్ చేసిన కనెక్షన్స్ అనే ప్రైవేట్ ఆల్బమ్‌కి దీపక్ ప్రోగ్రామర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఏఆర్‌రెహమాన్ సంగీత సారధ్యంలో వచ్చిన జోదా అక్బర్, గజిని, స్లమ్‌డాగ్ మిలియనీర్, రావణ్, రోబో, ఇలా అనేక సినిమాలకి రికార్డింగ్ ఇంజనీర్‌గా, సౌండ్ ఇంజనీర్‌గా, మిక్సింగ్ ఇంజనీర్‌గా పనిచేశారు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకి బెస్ట్ సౌండ్ ట్రాక్ ఇంజనీర్‌గా గ్రామీ అవార్డ్ దక్కించుకోగా.. ‘వైండ్స్ ఆఫ్ సంసార’ ఆల్బమ్‌కు సరౌండ్ మిక్స్ ఇంజనీర్‌గా పనిచేసినందుకు 54వ వార్షిక గ్రామీ అవార్డ్స్ నుండి గుర్తింపు లభించింది.
ఏఆర్ రెహమాన్‌తోనే కాకుండా కీరవాణి, అనిరుధ్ రవిచందర్, జివి ప్రకాష్ కుమార్ వంటి సంగీత దర్శకులతో కూడా కలిసి పనిచేశారు. ఆస్కార్ అవార్డ్ అందుకున్న స్లమ్ డాగ్ మిలియనీర్‌లోని జయహో పాటకి సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశారు దీపక్. ప్రస్తుతం దిగ్గజ సంగీత దర్శకుల దగ్గర లైవ్ రికార్డింగ్ మిక్సర్‌గా పని చేస్తున్నారు. మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా కూడా సొంతంగా ఆల్బమ్స్ చేస్తున్న దీపక్‌ని మరో గ్రామీ అవార్డ్ వరించింది. రిక్కీ కేజ్, స్టెవార్ట్ కోప్‌లాండ్ రూపొందించిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్‌కి దీపక్ మిక్సింగ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఈ ఆల్బమ్‌కి ఉత్తమ మిక్సింగ్ ఇంజనీర్‌గా దీపక్‌కి 64వ వార్షిక గ్రామీ అవార్డ్ లభించింది. రోబో ఒరిజినల్ వెర్షన్ ఎంథిరన్‌కి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్‌గా విజయ్ మ్యూజిక్ అవార్డ్‌తో పాటు పలు అవార్డులు కూడా వరించాయి. ఈయన పనితనానికి హాలీవుడ్ సైతం ఇంప్రెస్ అయ్యింది. 2009లో ‘కపుల్స్ రీట్రీట్’, 2010లో ‘127 అవర్స్’ సినిమాలకి మిక్సింగ్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2019 నుండి డాల్బీ అట్మాస్‌లో మిక్సింగ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దీపక్.. పలు జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులకు మాస్టర్ ఇంజనీర్‌గా కూడా పనిచేస్తున్నారు. మరి గిటారిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో గౌరవం పొందుతున్న విశాఖ వాసి అయిన దీపక్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.