ఒక్కడిగా మొదలై.. చిత్రి సీమలో ఒక శక్తిగా, మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి చిరంజీవి. ఆయన ఎదగడమే కాదు.. తన చుట్టూ ఉన్నవారికి చేయూతనిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడుతుంటారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సాయాలను లెక్కల్లో చెప్పడం కూడా కష్టం అనడంలోనే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతటి దానగుణం కలిగిన వ్యక్తో. ఇండస్ట్రీలో ఉన్న ఎందరికో అండగా నిలిచారు.. అన్నయ్యగా ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తి చిరంజీవి. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్లు నిర్వహిస్తూ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఆయన సొంతం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి చిత్రపురి కాలనీలో తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరిట ఆస్పత్రి నిర్మిస్తానంటూ ప్రకటించి మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వచ్చే ఏడాది తన పుట్టినరోజు నాటికి ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తానంటూ ప్రకటించారు. మనిషిగా మనం మాత్రమే ఎదగడం కాదు.. మన చుట్టూ ఉన్న వారు కూడా ఎదిగేందుకు ఒక అవకాశం కలిగించాలని చెప్పకనే చెప్పారు. చిరంజీవి చేసిన ప్రకటనపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. డల్లాస్ లో క్రికెట్ సెలబ్రిటీ ట్రోఫీ అనౌన్స్ మెంట్, జెర్సీ లాంఛ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ చిరంజీవి గొప్పతనం గురించి కొనియాడారు. “ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదిగారని కాదు.. అతని చుట్టూ ఉన్న వాళ్లు ఎదిగేలా ఎంత సహాయం చేశాడనే దాన్ని బట్టే అతని ఎత్తును కొలుస్తారు. అలాంటి విషయాల్లో అందరికీ అన్నయ్యే ముందు వరుసలో ఉంటారు. ఎప్పుడన్నా కలవడానికి ఇంటికి వెళ్తాం.. చేతిలో ఏదో ప్యాకెట్ ఉంటుంది. ప్రకాశ్ ఒక్క నిమిషం అంటారు. ఎవరికీ తెలియకుండా సహాయం చేస్తారు. అలా అందరికీ తెలిసేలా చేస్తే అందరికీ నచ్చదు అంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి” అంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. చిరంజీవి నిర్మించబోయే ఆస్పత్రికి తమవంతు సహాయం చేస్తామంటూ శ్రీకాంత్, తరుణ్, సుధీర్ బాబు, తమన్ ముందుకొచ్చారు. చిత్రపురి కాలనీకోసం రూ.20 లక్షలు ఇవ్వాలనుకుంటున్నట్లు తరుణ్ ప్రకటించాడు. డల్లాస్ ట్రీఫీ ద్వారా వచ్చే మొత్తంలో కొంత చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు ఇవ్వనున్నట్లు శ్రీకాంత్ తెలిపాడు. ఓ మ్యూజిక్ కాన్సెర్ట్ ఏర్పాటు చేసి వచ్చిన మొత్తం చిత్రపురి ఆస్పత్రి కోసం ఇస్తానంటూ తమన్ వెల్లడించాడు. చిత్రపురి కాలనీలో చిరంజీవి ఆస్పత్రి నిర్మించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: కార్తికేయ 2 డైరెక్టర్ చందూ మొండేటికి అమితాబ్ బచ్చన్ బిగ్ సర్ప్రైజ్.. ఇదీ చదవండి: క్లాసికల్ డ్యాన్స్ తో జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పిన శ్రియ! వీడియో వైరల్..