సినీ పరిశ్రమలో ఉన్న వారికి నేమ్, ఫేమ్‌తో పాటు కష్టాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. వారికంటూ వ్యక్తిగత జీవితం ఉండదు. మీడియా ఎప్పుడు వారి చూట్టునే ఉంటుంది. ఇక సినీ ఇండస్ట్రీలో ఉండే జనాల మీద వచ్చినన్ని పుకార్లు ఎవరి మీద రావు. కానీ సినిమాల మీద అభిమానంతో వీటన్నింటిని భరిస్తూ ఉంటారు. అయితే ప్రతి దానికి ఓ లిమిట్ ఉంటుంది. దాన్ని దాటడానికి ప్రయత్నిస్తే.. ఇదిగో ఇక్కడ ఓ కమెడియన్‌నకు ఎదురైన పరిస్థితి తలెత్తుతుంది. సామాన్యంగా తమ గురించి ఎవరు ఎమన్నాపెద్దగా పట్టిచుకోకపోయినా.. కుటుంబం జోలికి వస్తే సీరియస్‌గా రియాక్ట్ అవుతారు. అదే పని చేశారు ఓ స్టార్ హీరో. తన భార్య గురించి వెకిలి మాటలు మాట్లాడిన వ్యక్తి చెంప చెళ్లుమనిపించాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: వేషం మార్చిన బాలయ్య.. పెళ్లిలో సందడి..
94వ ఆస్కార్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆస్కార్స్ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా.. నటుడు విల్ స్మిత్, స్టేజ్‌పై మాట్లాడుతున్న అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించాడు. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇవ్వడానికి స్టేజ్ ఎక్కిన క్రిస్.. ఏదో మాట్లాడుతూ విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ మీద జోక్ పేల్చాడు.
ఇది కూడా చదవండి: ఆస్కార్ నామినేషన్స్ లో “జైభీమ్” కి దక్కని స్థానం..అనారోగ్యంతో బాధపడుతున్న పింకెట్ స్మిత్ గుండు చేయించుకుని ఉండగా.. ఆమె లుక్ మీద క్రిస్ జోక్ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్ స్మిత్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. స్టేజ్ మీదకు సీరియస్‌గా నడుచుకుంటూ వెళ్లిన స్మిత్.. క్రిస్ దవడ పగలకొట్టాడు. ఆ మరుక్షణమే కిందికి దిగి కుర్చీలో కూర్చున్నాడు. క్రిస్ వెకిలిగా ఏదో వివరణ ఇవ్వబోతుండగా.. అభ్యంతరకరమైన పదంతో నోరు మూయమంటూ క్రిస్‌కు సూచించాడు విల్ స్మిత్.
VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa
— Timothy Burke (@bubbaprog) March 28, 2022
ఇది కూడా చదవండి: ఆ సమయంలో బతకడం వేస్ట్.. నాకు ఈ ప్రపంచం వద్దనిపించింది: ప్రకాశ్ రాజు
అయితే ఇదంతా లైవ్‌లో ప్లే కాలేదు. కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితేఘా తరవఆత విల్ స్మిత్ దీనిపై క్రిస్‌కు క్షమాపణలు తెలియజేశాడు. ఇక ఆస్కార్ అందుకున్న సందర్భంగా విల్ స్మిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీరు పెట్టుకున్నాడు. ఇక విల్ స్మిత్ ఇప్పటికి మూడు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు. ‘అలీ’, ‘ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్’, ‘కింగ్ రిచర్డ్’కు గానూ మూడుసార్లు ఉత్తర నటుడి కేటగిరీలో నామినేట్ అయ్యారు ఆయన. అయితే ది ఫ్రెష్ ప్రిన్స్‌గా పేరున్న విల్ స్మిత్‌కు ఆస్కార్ 2022లో అవార్డు ముచ్చట తీరింది. కింగ్ రిచర్డ్‌లో వీనస్, సెరీనా విలియమ్స్ తండ్రి రిచర్డ్ విలియమ్స్ పాత్రలో ఆయన కనబర్చిన అద్భుతమైన నటనకు ఆస్కార్ అందుకున్నాడు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Here’s Will Smith’s tearful acceptance speech at the #Oscars. https://t.co/ulvT7fsB57 pic.twitter.com/Uq2krBbBld
— Variety (@Variety) March 28, 2022