చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్తూ ప్రమాదానికి గురై ప్రముఖ హాస్యనటుడు మృతిచెందాడు. అతడి మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
సినీ పరిశ్రమలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు నటీనటులు షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్తూ, షూటింగ్ లలో పాల్గొంటూ ప్రమాదాలకు గురై కొందరు తీవ్రంగా గాయపడి, మరికొందరు తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఫేమ్, యూట్యూబర్, ప్రముఖ హాస్యనటుడు షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు మృతి చెందాడు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హాస్య నటుడి మృతి పట్ల సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిభ కలిగిన వారు డిఫరెంట్ కంటెంట్ తో వీడియోలు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంటూ దూసుకెల్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో ‘దిల్ సే బురా లగ్తా హై’ అనే డైలాగ్ తో అందరికి నవ్వులు పంచి యూట్యూబ్ వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్నాడు దేవరాజ్ పటేల్. వినూత్న వీడియోలతో యూట్యూబ్ లో వైరల్ గా మారి గుర్తింపు తెచ్చుకున్నాడు.
యూట్యూబ్ లో దేవరాజ్ పటేల్ కు దాదాపు నాలుగు లక్షలపైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. దీంతో దేవరాజ్ పటేల్ కు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించే అవకాశం వచ్చింది. తాజాగా ఓ షూటింగ్ లో పాల్గొనేందుకు రాయ్ పూర్ వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. దేవరాజ్ పటేల్ మరణం పట్ల ఛత్తీస్ ఘడ్ సిఎం భూపేష్ బాఘేల్ ట్వీట్ చేశారు. దేవరాజ్ పటేల్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. సినీ ప్రముఖులు కూడా దేవరాజ్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.