సినిమా రంగంలోని కొంతమంది నటీనటులు లేటు మ్యారేజెస్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. కెరీర్ లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో లేటు వయసులో తల్లిదండ్రులవుతున్నారు.
కాలం మారుతోంది, వ్యక్తుల ఆలోచన విధానాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జీవితంలో మంచి స్థితిలో స్థిరపడాలని కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం సాధించి ఆ తర్వాతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లీడు వచ్చిన వెంటనే యువతీ యువకులకు పెళ్లిల్లు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారు అనుకున్న రంగంలో స్థిరపడిన తర్వాతనే పెళ్లి ప్రస్తావనకు వస్తున్నారు. ఇదే రీతిలో సినీ పరిశ్రమకు చెందిన ఓ నటి 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని త్వరలో తాను తల్లిని కాబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్యనటి షర్మిలి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వనిత విజయ్ కుమార్ నిర్వహించిన ఇంటర్య్వూలో హాస్య నటి షర్మిలి పాల్గొన్నది. ఆ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తను నలబై ఏళ్ల వయసులో ఓ ఐటి ప్రొఫెషనల్ ను పెళ్లి చేసుకున్నానని తెలిపింది. తనకు ఇప్పుడు నలబై ఎనిమిదేళ్ల వయసని, ప్రస్తుతం గర్భం దాల్చానని తెలిపింది. త్వరలో తల్లి కాబోతున్నానని తెలిపింది. ఇంకా తన భర్త గురించి చెప్తూ అతడు తనకు ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో మద్దతిస్తాడని తెలిపింది. ప్రసవం అనంతరం మళ్లీ సినిమాల్లో నటిస్తానని తెలిపింది. ఈ మధ్య కొంత మంది నటీనటులు లేటు వయసులో పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.