భారతీయులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అట్టహసంగా ప్రారంభమైంది. ఈ సారి ఆస్కార్ బరిలో ట్రిపుల్ ఆర్ చిత్రం నిలవడంతో.. ఈ ఏడాది అవార్డులు తెలుగు వారికి ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఆ వివరాలు..
సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆస్కార్ అవార్డులు-2023 వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. ఈ సారి ఆస్కార్ అవార్డులు తెలుగు వారికి ఎంతో ప్రధానమైనవి. ఈ ఏడాది ఆస్కార్స్ బరిలో ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట నామినేట్ అయిన సంగతి తెలిసిందే. జక్కన్న టీం ఆస్కార్ అవార్డు గెలవాలని ప్రతి తెలుగువాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆస్కార్ అవార్డ్స్ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా చేరుకున్న ఆర్‌ఆర్‌ఆర్ టీమ్.. నేడు ఆస్కార్ వేదిక వద్ద.. సందడి చేసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో భారతీయ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మొదలైంది. దీని కన్నా ముందు శాంపెయిన్ కార్పెట్ నిర్వహించారు.
ఈ శాంపెయిన్ కార్పెట్‌పై హాలీవుడ్ స్టార్స్‌తో పాటు ట్రిపుల్ ఆర్ టీంసందడి చేసింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆల్ బ్లాక్ స్టైలీష్ లుక్‌లో తళుక్కుమన్నారు. దర్శకధీరుడు రాజమౌళి భారత సాంప్రదాయ దుస్తుల్లో వేడుకకు హాజరయ్యారు. రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి రామ్ చరణ్ శాంపెయిన్ కార్పెట్‌పై నడిచారు. ఇక ‘నాటు నాటు’ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ సైతం శాంపెయిన్ కార్పెట్ వేడుకలో కెమెరాలకు పోజులిచ్చారు. ఆస్కార్స్ 2023 వేడుకను ప్రెజంటర్ జిమ్మీ కిమ్మెల్ తన సరదా సంభాషణతో మొదలుపెట్టారు. ఆయన తన స్పీచ్ ముగించే సమయానికి వేదికపైకి కొంత మంది ఇంగ్లిష్ డాన్సర్లు వచ్చారు. వారంతా నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ జిమ్మీని తీసుకెళ్లారు. నాటు నాటు ఆస్కార్ గెలుస్తుందో లేదో మరి కొద్ది సమయంలో తెలియనుంది.
#NaatuNaatu live performance at the Oscars Stage Got a massive response and a standing ovation.🌟✨🔥🙏#NaatuNaatuForOscars 💪😍 @RRRMovie pic.twitter.com/ePS5wfwSXo
— SumanTV (@SumanTvOfficial) March 13, 2023