ఎన్టీఆర్.. టాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. ఇందులో రాజమౌళి, త్రివికమ్ లాంటి స్టార్ డైరెక్టర్ పాల్గొనడం కాదు.. ఓ హాలీవుడ్ పర్సన్ కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది.
ఎన్టీఆర్ పేరు చెప్పగానే ఆహా, ఓహో సూపర్ యాక్టర్ అని అందరూ తెగ పొగిడేస్తారు. అందుకు తగ్గట్లే ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో జీవించేస్తాడు. ప్రేక్షకుల్ని శెభాష్ అనేలా జీవించేస్తాడు. అలా కొన్నాళ్ల ముందు వరకు తెలుగువరకే పరిమితమైన తారక్.. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీకి ఆస్కార్ రావడం ఏమో గానీ ఎన్టీఆర్ పాపులారిటీ చాలా పెరిగిపోయింది. తాజాగా ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు సడన్ గా తన ఇంట్లోనే గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీనేజీలోనే హీరో అయిపోయిన ఎన్టీఆర్, తన సినిమా కెరీర్ లో ఎత్తుపల్లాలు చాలానే చూశాడు. ‘టెంపర్’ మూవీ నుంచి పూర్తిగా లెక్క మార్చేశాడు. ఆ మూవీ ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్లు.. చేసిన ప్రతి సినిమాతోనూ హిట్ కొడుతున్నాడు. తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ప్రతి అభిమాని కాలర్ ఎగరేసుకునేలా చేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ కొట్టి, ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్.. బుధవారం రాత్రి తన ఇంట్లోనే గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. దీనికి రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివతో పాటు పలువురు నిర్మాతలు హాజరయ్యారు.
ఇదే పార్టీకి అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషన్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫేరెల్ రావడం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈయన తారక్ కి ఎక్కడ ఎప్పుడు పరిచయం అయ్యారనేది తెలియదు. బట్ ఈ పార్టీ ఇవ్వడం, గతంలో కలుద్దామనే మాటకు కట్టుబడి తారక్ దగ్గరకు రావడం ఇదంతా చూస్తుంటే.. పాన్ ఇండియా కాదు ఏకంగా గ్లోబల్ వైడ్ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే కొరటాల శివతో మూవీ చేస్తున్న తారక్, దీని తర్వాత బాలీవుడ్ స్పై యూనివర్స్ ‘వార్ 2’లో నటిస్తారు. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు ఈ పార్టీ జరగడం అంతా చూస్తుంటే.. అమెజాన్ స్టూడియోస్ నిర్మాణంలో తారక్ ఇంటర్నేషనల్ లెవల్ ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నాడా అనే సందేహం వస్తోంది. మరి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq
— Jr NTR (@tarak9999) April 12, 2023