సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రోజుల వ్యవధిలోనే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మృత్యువాత పడుతూ.. అటు వారి కుటుంబ సభ్యులను.. ఇటు అభిమానులను శోక సంద్రంలో ముంచుతున్నారు. కొన్ని రోజుల క్రితమే మలయాళ సింగర్ ఒకరు స్టేజీ మీద పాట పాడుతూ కుప్పకూలి.. మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే మరో ప్రముఖ గాయకుడు మృతి చెందారు. ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. కోల్కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం.
మృతి చెందడానికి ముందు కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్ గీతాలను ఆలపించారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
‘‘ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణ వార్త తెలిసి చాలా బాధపడ్డాను. అన్ని వయసుల వారిని ఆకట్టుకునే ఆయన పాటలు ఎన్నో భావోద్వేగాలను కలిగి ఉండేవి. ఆయన పాడిన పాటల ద్వారా జనాల హృదయాల్లో ఎప్పటికి సజీవంగానే ఉంటారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక కేకే మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అర్ధాంతరంగా అస్తమించిన గాయకులు #KK గారు నిన్న రాత్రి లైవ్ ప్రోగ్రాంలో ఉండగానే ఛాతీనొప్పి తో ఇబ్బందిపడడం & వెంటనే ఆసుపత్రికి వెళ్లడం – అంతా సెకండ్స్ లో జరిగిపోయింది. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది 🙏
మీ పాటలు అజరామరం కేకే గారు 🙏#KKsinger #KKForever pic.twitter.com/51mjBV6vCu
— తెలుగు డేటాబేస్ (@TeluguDatabase) May 31, 2022
#WATCH | Singer KK died hours after a concert in Kolkata on May 31st. The auditorium shares visuals of the event held some hours ago. KK was known for songs like ‘Pal’ and ‘Yaaron’. He was brought dead to the CMRI, the hospital told.
Video source: Najrul Manch FB page pic.twitter.com/YiG64Cs9nP
— ANI (@ANI) May 31, 2022
140secs lo pettalem asalu aa songs ni 🙏 but some of everyones favourites by #KK sir 💔 chinna edit #RIPKK pic.twitter.com/j7HYa1HSfA
— Influencer🎶 (@RMKtweets2) May 31, 2022