జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్లుగా, స్టార్ కమీడియన్స్ గా ఎదిగారు. చాలా మంది వెండితెరపై కూడా ఎన్నో అవకాశాలు దక్కించుకున్నారు. వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరని చెప్పొచ్చు. జబర్దస్త్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో మంచి అవకాశాలు దక్కించుకుంది. అనసూయకు అటు ఫ్యాన్ బేస్ కూడా ఎంతో పెరిగింది. అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ నుంచి జడ్జులు, కమీడియన్లు వెళ్లిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా ఆ షో నుంచి తప్పుకోకున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి.
వాటికి బలం చేకూరుస్తూ.. ఇటీవల యాంకర్ అనసూయ తన కెరీర్‌లో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. “నా కెరీర్‌కు సంబంధించి ఓ అతిపెద్ద నిర్ణయం తీసుకుని.. దానిని ఈ రోజు అమలు చేశాను. నాతో ఎన్నో జ్ఞాపకాలను తీసుకెళ్తున్నాను. వాటిలో చాలా వరకు మంచివి.. కొన్ని చెడ్డవి, ఇంకొన్ని దారుణమైనవి. మీరంతా ఎప్పటిలాగానే నాతో కలిసి ప్రయాణిస్తారని ఆకాంక్షిస్తున్నాను” అంటూ అనసూయ భరద్వాజ్ స్టోరీ పోస్ట్ చేసింది. దీంతో ఆమె జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం ఖాయమైనట్లు టాక్ మొదలైంది.
ఇప్పుడు ఆమె స్థానంలో మరో స్టార్ యాంకర్ జబర్దస్త్ జడ్జ్ గా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు.. యాంకర్ ‘మంజూష రాంపల్లి’. అనసూయ స్థానంలో జబర్దస్త్ కు మంజూష రాంపల్లిని తీసుకున్నట్లు చెబుతున్నారు. మంజూష కూడా ఇటీవల సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు అంటూ ఎంతో బిజీగా ఉంటోంది. అటు సోషల్ మీడియాలో కూడా మంజూషకు మంచి ఫాలోయింగ్ ఉంది. అవన్నీ చూసే ఇప్పుడు అనసూయ స్థానంలో ఆమెకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అనసూయ స్థానంలో మంజూష రాంపల్లి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.