ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ ప్రమాదాల్లో మరణిస్తున్నారు.. కొంత మందికి తీవ్ర గాయాలతో బయటపడుతున్నారు. యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్, కేజీఎఫ్ 2. ఈ చిత్రాల్లో కీలక పాత్రలో కనిపించిన బీఎస్ అవినాష్ కి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన బెంగళూరులో కారు ప్రమాదానికి గురైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలో నటించిన అవినాష్ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు ట్రక్కును ఢీకొట్టింది, అయితే అదృష్టవశాత్తూ.. అతనికి పెద్దగా గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణం అయిన ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కబ్బన్‌పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన బాటసారులు వచ్చి అవినాష్‌ను రక్షించి కారులో నుంచి బయటకు తీసి.. ఆసుపత్రిలో చేర్పించారు. తనకు ప్రమాదం జరిగిందని.. సురక్షితంగా బయట పడ్డానని స్వయంగా అవినాశే తెలిపారు. కెజిఎఫ్ లో మూవీలో అండ్రూ పాత్రలో అద్భుత నటన ప్రదర్శించాడు. యాక్షన్ హీరో అర్జున్ సర్జా బంధువు.. దివంగత నటుడు చిరంజీవి సర్జా ద్వారా అవినాష్‌కి కేజీఎఫ్ లో నటించే అవకాశం వచ్చింది. ఒకానొక సందర్భంలో సినిమాటో గ్రాఫర్ భువన గౌడతో పరిచయం ఏర్పడి తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అలా కేజీఎఫ్ సీరీస్ తో అవినాష్ కి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by B.s. Avinash (@avinashbs)