ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా బేబీ. ఈ సినిమా జూలై 14న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ ఇప్పుడు వివాదానికి దారి తీసేలా ఉంది. కొంతమంది నెటిజన్స్ ఈ పోస్టర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టు ఉంటారు. మినిమమ్ ఇట్టా ఉండాలి అంటూ యాటిట్యూడ్ చూపిస్తారు. అర్జున్ రెడ్డి సినిమా నుంచి విజయ్ దేవరకొండ అగ్రెసివ్ గా ఉంటూ వచ్చారు. అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో అందులో మహిళను ఉద్దేశించి ఉన్న డైలాగ్ తో వివాదంలో ఇరుక్కున్నారు. అనసూయ లాంటి వాళ్ళు ఇదేమీ పద్ధతి కాదంటూ విమర్శించారు. అయినప్పటికీ ఈ వివాదంతో మూవీకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. ఎంత వివాదంలో ఉంటే అంత పబ్లిసిటీ వస్తుంది అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పబ్లిసిటీ కోసం దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన బేబీ సినిమా జూలై 14న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్స్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్లే ఇప్పుడు నెటిజన్స్ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆనంద్ దేవరకొండకు జోడీగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా.. సాయి రాజేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా టీజర్ చూస్తే మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ అనే ఫీలింగ్ కలుగుతుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్స్ మాత్రం టీజర్ కి భిన్నంగా ఉన్నాయి. భిన్నంగా ఉన్నా పర్లేదు గానీ మరీ దిగజారుడుగా ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బేబీ పోస్టర్ లో హీరోయిన్ దుస్తుల లోపల మిడిల్ ఫింగర్ ఉంటుంది. ఇదే పోస్టర్ అంట. ఇందులో ఏం కాన్సెప్ట్ ఉందో తెలియదు గానీ ఇదేమీ మాస్ పబ్లిసిటీరా బాబు అంటున్నారు. అన్న బాటలోనే తమ్ముడు కూడా పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నాడని, మరీ ఇంతలా దిగజారాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పోస్టర్ ఏం సంకేతాన్ని ఇస్తుంది.. ఇదేమీ పోస్టర్ రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మిడిల్ ఫింగర్ ఏంటి అక్కడ పెట్టావ్.. అమ్మాయిలకు ఇదేనా మీరిచ్చే గౌరవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాలు ఈ పోస్టర్ ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి. ఏదేమైనా గానీ ఈ పోస్టర్ వివాదాన్ని సృష్టించేలా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బేబీ పోస్టర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Idem poster ra ungaa 🤣🤣
Editor evadra deniki #BabyTheMovie #Ananddevarakonda #VaishnaviChaithanya #SKN pic.twitter.com/hSAD2OUlKC
— 🅰️J🅰️Y ALLU RAPO 🔥 (@AjayAllu15) June 29, 2023
#BabyTheMovie Releasing poster
What poster indicate?
Is #AnandDevarakonda following #VijayDevarakonda foot steps for publicity! pic.twitter.com/tgv431QQo9
— Telugubit (@telugubit) June 29, 2023