సాధారణంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలా మంది ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. వెకేషన్‌కు వెళ్లడం.. లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గడపడం చేస్తారు. మరి కొందరు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇక సెలబ్రిటీలు అయితే న్యూఇయర్ వేడుకల కోసం విదేశాలకు చెక్కేస్తుంటారు. సెలబ్రేషన్స్ ముగిశాక.. తిరిగి వస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే.. ఆరోజున మంచి పనులు చేస్తారు. ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడమేనా.. ఒకసారి.. మన చుట్టూ ఉండే వారిని కూడా పలకరించి.. మన సంతోషాన్ని వారితో షేర్ చేసుకుందాం అనుకుంటారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఇదే విధంగా ఆలోచించారు. భర్తతో కలిసి.. న్యూఇయర్ రోజున పేదపిల్లలకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది నయన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
2022 లేడీ సూపర్‌స్టార్ నయనతారకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. కెరీర్ సంగతి పక్కకు పెడితే.. వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుని.. ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది నయనతార. ఆ తర్వాత సరోగసి ద్వారా.. పండంటి కవలలకు తల్లయ్యింది. ఇలా 2022 ఏడాది నయనతార జీవితంలో మరుపురాని జ్ఞాపకాలు మిగిల్చింది. ఇన్ని సంతోషాలతో.. నూతన ఏడాది 2023కి స్వాగతం పలికింది నయనతార. ఈ క్రమంలో తన సంతోషాన్ని తోటి వారితో పంచుకోవాలనుకుంది. దానిలో భాగంగా.. చెన్నైలోని ప్రముఖ రైల్వే స్టేషన్ దగ్గరలోని వీధి బాలలకు.. న్యూ ఇయర్ గిఫ్ట్స్ అందించింది నయనతార.
నూతన సంవత్సరం సందర్భంగా.. నయన్, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఇద్దరు కలిసి చెన్నైలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పేద పిల్లలకు న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఇచ్చారు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరలవుతోన్నాయి. ఇవి చూసిన అభిమానులు.. నయన్‌కు అందం మాత్రమే కాదు.. అంతకన్నా అందమైన మనసుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార ప్రధాన పాత్రలో నటించిన కనెక్ట్ సినిమా తాజాగా విడుదలయ్యింది. ఈ సినిమాకు ఆమె భర్త విఘ్నేష్ శివన్ భాగస్వామిగా వ్యవహరించాడు. ఇక ఈ కొత్త ఏడాది నయన్ బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టనుంది. షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించనుంది. ఈ సినిమా 2023, జూన్ 2న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. మరి నయనతార చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.