ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు రెండు లేదా మూడు వారాలు ఆడటమే గగనం అయిపోయింది. మరీ బాగుంటే కొన్ని సినిమాలు అతి కష్టం మీద తక్కువ థియేటర్లలో 50 రోజులు ఆడుతున్నాయి. అందులోనూ ఇదివరకటిలా వారానికి ఒకటి రెండు సినిమాలు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలకు పైగా రిలీజ్ అవుతున్నాయి. రెండు వారాలు తిరగకుండానే థియేటర్లలో కనిపించకుండా పోతున్నాయి.
ఇలాంటి కష్టతరమైన సమయంలో ఓ సినిమా 50 రోజులు ఆడిందంటే ఆశ్చర్యపోక తప్పదు. కానీ అదే సినిమా.. 50, 100, 150 రోజులు దాటి 175 రోజులు థియేటర్లో ఆడితే ఆ సినిమాను ఏమనాలి.. అందులో నటించిన హీరోని ఏమనాలి? ప్రస్తుతం ఇండస్ట్రీలో అదే చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఓ తెలుగు సినిమా గురించి.. ఓ తెలుగు హీరో గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ హీరో ఎవరా? అని ఆలోచిస్తున్నారా.. ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆయన నటించిన ‘అఖండ’ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో అఖండ సినిమా ఏకంగా 175 రోజులు పూర్తిచేసుకుంది.
రీసెంట్ గా ఇండియాలో ఇన్ని రోజులపాటు ఏ సినిమా ఆడలేదు. తాజాగా అఖండ సినిమా క్రియేట్ చేసిన రికార్డుతో బాలయ్య ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా అవతరించాడని సినీవర్గాలు చెబుతున్నాయి. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసి ప్రేక్షకులను థియేటర్లకు పరిగెత్తించింది. అలాగే విడుదలైన అన్నిచోట్లా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో బాలయ్య యాక్షన్, డైలాగ్స్, డాన్స్ అన్ని హైలైట్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తదుపరి సినిమాలను గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిలతో చేస్తున్నాడు. మరి ఇండియాలో నెంబర్ 1 హీరో బాలయ్య అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#NandamuriBalakrishna and #BoyapatiSreenu’s MASSive Blockbuster #Akhanda 🦁 completes 175 Days 🔥 We sincerely thank all the audiences for showering so much love towards us.#175DaysofAkhanda#RoaringBlockbusterHit@ItsMePragya @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/krbhRWZpG1
— Dwaraka Creations (@dwarakacreation) May 25, 2022