తెలుగు చిత్రపరిశ్రమలో అద్భుతమైన నటులుగా పేరొందిన వారిలో మంచి మనసున్న స్టార్లు కూడా ఉన్నారు. వారు చేసిన మంచి గురించి వారే చెప్పుకుంటే సొంతంగా డప్పు కొట్టుకున్నాడనే రోజులివి. అయితే.. సినీ నటులు చేసే మంచి గురించి, వారి మంచి మనసు గురించి వారితో పనిచేసిన దర్శకులు, నిర్మాతలే చెబుతుండటం చూస్తుంటాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మనసున్న అగ్రహీరోలలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు.
ఆయన చేసే సినిమాలు ఊరమాస్ లెవల్లో ఉండవచ్చు.. కానీ వ్యక్తిగతంగా చేసే మంచి పనులు కూడా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని చెబుతున్నారు సినీప్రముఖులు. ఇండస్ట్రీ, ఫ్యాన్ బేస్ ఆయనను ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటుంది. బాలయ్య అభిమానులకు ఎంతటి విలువనిస్తారో.. ఆయనతో పనిచేసే దర్శకులు, నిర్మాతల శ్రేయస్సు కూడా కోరుకుంటారని అందరికీ తెలిసిందే. తెలుగు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందే ఉంటారు బాలయ్య.
లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడేతత్వం బాలయ్యది కాదు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఆయన అభిమానులు, స్టార్ డైరెక్టర్స్ చెప్పారు. అయితే.. బాలయ్య మంచి మనసుకు నిదర్శనంగా నిలుస్తోంది ఇటీవల ఓ అభిమానితో జరిగిన సంఘటన. కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన కాశీ విశ్వనాథ్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. బాలయ్యకు వీరాభిమాని కావడంతో లైఫ్ లో ఒక్కసారైనా ఆయనను కలవాలని ఆశపడ్డాడు.
ఈ విషయం ఆదోని బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సజ్జాద్ హుస్సేన్ కి తెలిసి.. విషయాన్ని బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన బాలయ్య.. వీరాభిమాని కాశీ విశ్వనాథ్ తో వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పారు. అభిమాని కోరిక నెరవేర్చి బాలయ్య మరోసారి మంచి మనస్సును చాటుకున్నాడు. అభిమాని కష్టాన్ని గుర్తించి ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నా అని ధైర్యన్ని ఇచ్చిన బాలయ్యపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఓ అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసి స్పందించే హీరోలు ఇండస్ట్రీలో ఎంతమంది ఉంటారని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్య కెరీర్ లో 100కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా అఖండ నిలిచింది. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ మాస్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు. అటు సీనియర్ డైరెక్టర్ లతో పాటు యంగ్ డైరెక్టర్లకు సైతం అవకాశాలు ఇవ్వడం విశేషం. మరి బాలయ్య గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.