సెలబ్రిటీలు ఓవైపు సినిమాల పరంగా కెరీర్ సాగిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో రాణించే ప్రయత్నాలు చేస్తుంటారు. టాలీవుడ్ లో అటు సినిమాలను, ఇటు బిజినెస్ ని సమపాళ్లలో మేనేజ్ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే.. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల పేర్లే వినిపిస్తాయి.
ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఓవైపు సినిమాల పరంగా కెరీర్ సాగిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో రాణించే ప్రయత్నాలు చేస్తుంటారు. టాలీవుడ్ లో అటు సినిమాలను, ఇటు బిజినెస్ ని సమపాళ్లలో మేనేజ్ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే.. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల పేర్లే వినిపిస్తాయి. సినిమాలతో పాటు పలు కమర్షియల్ బ్రాండ్స్ కి ప్రమోటర్ గా వ్యవహరిస్తున్న మహేష్.. సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా దూసుకుపోతున్నాడు. ఒకవేళ మహేష్ సినిమాలతో బిజీ అయినా.. ఆయన సతీమణి నమ్రత బిజినెస్ విషయాలను.. ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటోంది.
ఇక ఇటీవలే మహేష్, నమ్రత ఆసియన్స్ గ్రూప్స్ వారితో కలిసి రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో ఏఎన్ రెస్టారెంట్ ని ప్రారంభించిన నమ్రత.. తాజాగా అదే ఆసియన్ సంస్థతో కలిసి బంజారాహిల్స్ లో ‘ప్యాలస్ హైట్స్’ రెస్టారెంట్ ని జ్యోతి ప్రజ్వలన చేసి గ్రాండ్ గా ఓపెన్ చేసింది. ఏసియన్ గ్రూప్, మినర్వా గ్రూప్ కి సంయుక్తంగా ప్రారంభించిన మినర్వా కాఫీ షాప్ కూడా ఈ మధ్యే మొదలైంది. ఇక ప్యాలెస్ హైట్స్, మినర్వా కాఫీ షాప్’ రెండూ బంజారాహిల్స్ లోనే ఉండటం విశేషం. అత్యంత ఆధునిక లగ్జరీ వసతులతో, అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్ తో మంచి అనుభూతినిచ్చే విధంగా ఈ ప్యాలెస్ హైట్స్ రెస్టారెంట్ ని నిర్మించారు. ప్రస్తుతం నమ్రత ఓపెన్ చేసిన ప్యాలస్ హైట్స్ రెస్టారెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#NamrataShirodkar and Team Asian @AsianSuniel inaugurate their new fine dining and multi-cuisine restaurant, AN Palace Heights- Hyderabad’s royal culinary experience, in Banjara Hills! pic.twitter.com/RW3fHp9C9S
— Mana Stars (@manastarsdotcom) February 22, 2023