Namitha: తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలు చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నమిత ఒకరు. తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే.. 2017లో బిజినెస్ మ్యాన్ వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు, నటనకు దూరంగా ఉంటోంది. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి అప్ డేట్స్ ఇస్తుంటుంది.
ఇక ఇప్పుడు ప్రెగ్నన్సీతో ఉన్న నమిత.. త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే గ్రాండ్ గా సీమంతం కూడా జరుపుకుంది. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత భర్త వీరేంద్రతో కలిసి బేబీ బంప్ ఫోటోషూట్ కూడా చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. కానీ.. తాజాగా మరోసారి నమిత తన బేబీ బంప్ ఫొటోలతో పాటు వీడియోలు పోస్ట్ చేసింది.
ప్రస్తుతం నమిత 9 నెలల గర్భిణీ అని తెలుస్తుంది. అతి త్వరలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో నిండు గర్భిణిగా ఉన్న ఫొటోషూట్ నిర్వహించి.. ఆ ఫొటోలను, వీడియోలను షేర్ చేశారు. దీంతో నమిత ‘కమ్మింగ్ సూన్’ అంటూ చేసిన బేబీ బంప్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నమిత లేటెస్ట్ బేబీ బంప్ వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.