నమిత మత్తు పదార్థాలకు అలవాటు పడింది, మానేయాలని బుద్ధిగా చెప్పినా వినిపించుకోవడం లేదు.. అంతే కాకుండా ఆమెకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న లక్షీశ్ ప్రభుతో రిలేషన్ పెట్టుకుంది. ఇటీవల ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో నిలదీశానని నమిత భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు.
సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల టాలీవుడ్ ప్రొడ్యూసర్ (కబాలి తెలుగు నిర్మాత) కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేయడం, అతను సెలబ్రిటీలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో పాటు సినీ రంగానికి చెందిన పలువురి ఫోన్ నెంబర్లు అతని వద్ద ఉండడంతో వారికి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందేమోననే కోణంలో వార్తలు రావడంతో సురేఖా వాణి, జ్యోతి, అషు రెడ్డి వంటి వారు స్పందించడం జరిగింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న కేపీ చౌదరి విచారణలో ఇప్పటికే కొందరి పేర్లు వెల్లడించినట్లు సమాచారం. గతంలోనూ డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్స్ విచారణకు హాజరవడం తెలిసిందే. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపింది. శాండల్వుడ్లోనూ హీరోయిన్స్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లారు. కొద్ది రోజుల వరకు సద్దుమణిగిన మత్తు పదార్థాల తతంగం మళ్లీ వెలుగులోకి రావడంతో సినీ వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా తన భార్య నమితకు డ్రగ్స్ విక్రయించే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందంటూ స్వయంగా భర్తే పోలీసులకు ఫిర్యాదు చేయడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. కన్నడ నిర్మాత టి.చంద్ర శేఖర్, తన వైఫ్ నమిత మత్తు పదార్థాలకు బానిస కావడంతో పాటు డ్రగ్స్ అమ్మే వ్యక్తితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుందని ఆమెతో పాటు ఆమె స్నేహితుడు లక్షీశ్ ప్రభులపై బెంగుళూరు చెన్నమ్మనకెరె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కన్నడ నిర్మాత చంద్ర శేఖర్ రెండేళ్ల క్రితం నమితను పెళ్లి చేసుకున్నారు. బనశంకరి సెకండ్ స్టేజీలో వారు నివాసముంటున్నారు. నమిత మత్తు పదార్థాలకు అలవాటు పడింది, మానేయాలని బుద్ధిగా చెప్పినా వినిపించుకోవడం లేదు.. అంతే కాకుండా ఆమెకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న లక్షీశ్ ప్రభుతో రిలేషన్ పెట్టుకుంది. ఇటీవల ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో నిలదీశాను. దాంతో నాపై దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నమిత ఏమంటుందంటే..
అయితే తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని నమిత అతని మీద కంప్లైంట్ చేసింది. తనపై దాడి చేశాడని, లక్ష్మీశ్ తనకు స్నేహితుడు మాత్రమేనని, భర్త చెప్పేవన్నీ అబద్ధాలని, అతని స్నేహితులు అరుణ్, హేమంత్ తన మీద చాకుతో దాడి చేశారని, ఇంట్లో డ్రగ్స్ పెట్టి తనను అరెస్ట్ చేయిస్తానంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో నమిత, చంద్ర శేఖర్ల కంప్లైంట్స్ తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.