ఈ ఫోటో చిన్నారిని చూశారా.. ఎంత ముద్దుగా, బొద్దుగా కనిపిస్తుందో కదా. ఫోటోకే ఫోజులిస్తున్న ఈ కుట్టి.. ఊహించి ఉండదు తాను పెద్ద స్టార్ అవుతానని. చిరు మందహసంతో చిన్నప్పుడే కెమెరాకు ఫోజులిస్తోంది. తొలుత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తర్వాతి కాలంలో బోల్డ్ సీన్స్‌లో నటించింది.
ఈ ఫోటో చిన్నారిని చూశారా.. ఎంత ముద్దుగా, బొద్దుగా కనిపిస్తుందో కదా. ఫోటోకే ఫోజులిస్తున్న ఈ కుట్టి.. ఊహించి ఉండదు తాను పెద్ద స్టార్ అవుతానని. చిరు మందహసంతో చిన్నప్పుడే కెమెరాకు ఫోజులిస్తోంది. చారాడేసి కళ్లతో, ఒంటి మీద నూలు పోగు లేకుండా కనిపిస్తున్న ఈ బుడ్డది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీ, ఇంగ్లీషు సినిమాల్లో కనిపించింది. తొలుత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తర్వాతి కాలంలో బోల్డ్ సీన్స్‌లో నటించింది. ఆమె నటనకు మెచ్చిన తమిళ తంబీలు గుడి కూడా కట్టేశారు. కానీ ఆమె శరీరమే.. సినిమా అవకాశాలకు శాపంగా మారింది. ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కు పరిమితమైంది. ఇంతకు ఆమె ఎవరంటై మన నమిత.
‘తెలుసునా, తెలుసునా, మనస్సుకే తొలి కదలిక’,‘దిల్ దివానా మే హసీనా’అనే సాంగ్స్ ఇప్పటికి చాలా మందికి ఫేవరేట్. ఈ రెండు సాంగ్స్ లో కనిపించిన హీరోయిన్ నమిత. ఈమె మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 17 ఏళ్లకే మిస్ సూరత్‌గా టైటిల్ గెలిచింది. 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించింది. ఆమె తొలి సినిమా ఎంట్రీ టాలీవుడ్ కావడం విశేషం. సొంతంలో మంచి ఫెర్మామెన్స్ స్పోప్ ఉన్న పాత్రలో కనిపించిన ఆమె.. తర్వాత టాలీవుడ్ బిగ్ హీరో వెంకటేశ్ పక్కన ఆడి పాడింది. రవితేజతో కలిసి ఒక రాజు, ఒక రాణి, శ్రీకాంత్, ప్రభుదేవాల పక్కన ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లిలో మెరిసింది. ఆ తర్వాత తమిళంలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అక్కడికి వెళ్లాక.. ఆమె బొద్దుగా మారిపోయింది.
బొద్డుగుమ్మలను ఇష్టపడే తమిళ తంబీలు..తమిళనాడూలో తిరునల్వేలి ప్రాంతంలో నమితకు గుడి కట్టారు. తెలుగులో ఐతే ఏంటీ, బిల్లా సినిమాల మధ్య ఆమె శరీరంలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కామసూత్ర నైట్స్ అనే ఇంగ్లీషు సినిమాలో నటించింది. బిల్లాలో ప్రభాస్ ప్రియురాలిగా గ్లామరస్ పాత్రలో కనిపించింది. తర్వాత బాలకృష్ణ సరసన సింహలో ఆడిపాడింది. అడపా దడపా మలయాళ, తమిళ సినిమాలు చేసింది. అవకాశాలు తగ్గిపోయాయి. నమిత తమిళ బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్‌లో పాల్గొంది. ఈ షో లో పరిచయం అయినా వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు (కవలలు). రాజకీయాల్లో కూడా ప్రవేశించింది. 2016లో అన్నాడిఎంకెలో చేరిన ఆమె.. 2019లో బిజెపీ కండువా కప్పుకుంది. ప్రస్తుతం బిజినెస్, పిల్లలతో కాలం గడుపుతుంది.