టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒక కొత్త కారును కొన్నారు. ఇది ఎలక్ట్రిక్ కారు కావడం విశేషం. దీని ధర ఎంతంటే..!
టాలీవుడ్ కింగ్ నాగార్జునకు అటు మాస్‌తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాక్షన్ మూవీస్‌తో పాటు కామెడీ, డెవోషనల్ జోనర్లోనూ సినిమాలు చేయడం వల్లే మిగతా హీరోల కంటే ఆయన కాస్త భిన్నమైన ఇమేజ్ను సంపాదించారు. అయితే ఈమధ్య మాత్రం నాగ్ ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. 63 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఫిట్‌గా, హ్యాండ్సమ్గా కనిపిస్తూ యువ హీరోలకు సవాల్ విసురుతున్నారు. రోజురోజుకీ నాగ్ ఏజ్ పెరగడం కాదు.. తగ్గుతున్నట్లు కనిపిస్తోందని ఆయన అభిమానులు అంటున్నారు. అలాంటి టాలీవుడ్ మన్మథుడు తాజాగా ఒక కొత్త కారు కొన్నారు. కియా ఈవీ6 అనే ఎలక్ట్రిక్ కారును ఆయన కొనుగోలు చేశారు. నాగ్ కొత్త కారు ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిల్లో ఆయనతో పాటు అమలను కూడా చూడొచ్చు.
నాగార్జున కొన్న కియా ఈవీ6 కారు స్పెషాలిటీస్ విషయానికొస్తే.. ఇందులో వైర్లెస్ ఛార్జర్, స్మార్ట్ కీ, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంది. ఈ కారులో డ్రైవర్ సీటును 10 రకాలుగా అడ్జస్ట్ చేసుకునే సదుపాయం ఉంది. కియా ఈవీ6 కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 528 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా దూసుకెళ్లొచ్చు. అంతేకాదు.. ఈ కారు 100 కి.మీ.ల దూరం వెళ్లడానికి కేవలం నాలుగున్నర నిమిషాలు ఛార్జ్ చేస్తే సరిపోతుంది. అందుకోసం ఈ కారులో అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్‌ను అమర్చారు. కియా ఈవీ6 ధర సుమారుగా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల మేర ఉంటుందని తెలుస్తోంది. ఇక, సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘ది ఘోస్ట్’తో ఆడియెన్స్ ముందుకొచ్చారు నాగ్. కానీ ఆయన ఇంతవరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి చెప్పిన ఒక కథకు నాగార్జున ఓకే చెప్పారని టాలీవుడ్ టాక్.